కాస్టింగ్ కౌచ్ ఫై నటి శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణలు సంచనలం సృష్టిస్తున్నాయి. మొన్నటి వరకు టాలీవుడ్ ప్రముఖులను టార్గెట్ చేసిన శ్రీరెడ్డి ఇప్పుడు కోలీవుడ్ నటులపై విరుచుకుపడుతుంది. ఈ విమర్శలపై ఇప్పటికే ప్రముఖ నటుడు, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ స్పందించారు. తాజాగా శ్రీరెడ్డి ఆరోపణలపై కథానాయకుడు కార్తి స్పందించారు. ‘ఈ విషయానికి సంబంధించి నడిగర్ సంఘం త్వరలో అధికారిక ప్రకటన జారీ చేస్తుంది. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. నేను ఈ విషయం గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదు. శ్రీరెడ్డి చేస్తున్న ఆరోపణల్లో నిజం, సాక్ష్యం ఉంటే ఆమె పోలీసులను ఆశ్రయించాలి. అది వదిలేసి ఇలా సోషల్మీడియాలో అందరిపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశాన్ని పెద్దదిగా చేసి చూపించాలా? వద్దా? అన్నది మీడియా వర్గాలు ఆలోచించుకోవాలి.’ అని తెలిపారు.