YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అవిశ్వాస ప్రక్రియకు అన్నాడీఎంకే, బిజు జనతాదళ్‌లు దూరం?

అవిశ్వాస ప్రక్రియకు అన్నాడీఎంకే, బిజు జనతాదళ్‌లు దూరం?
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో రేపు చర్చకు రానుంది.ఈ అవిశ్వాస ప్రక్రియకు దూరంగా ఉండాలని అన్నాడీఎంకే, బిజు జనతాదళ్‌లు భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఈ వార్తలపై తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి స్పందించారు. రేపటి అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చేది లేదంటూ చెప్పారు. దీనిపై ఆయన మీడియాతో మాట్లాడారు.‘ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని ఆ రాష్ట్రం పోరాడుతోంది. అందుకనే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇంతకు ముందు పార్లమెంట్‌ సమావేశాల్లో కావేరీ వివాదం విషయంలో తమిళనాడుకు చెందిన ఏఐడీఎంకే ఎంపీలు నిరసన చేపట్టినప్పుడు మాకు మద్దతు ఇవ్వడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. మా రైతుల కష్టాలు తీర్చాలని మేం పోరాడుతుంటే మాకెవరు అండగా నిలిచారు? ఒక్కరాష్ట్రం ముందుకు వచ్చిందా? ఇప్పుడు ఒక రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మా మద్దతు కావాలంటున్నారు. మాకేమయినా వాళ్లు సాయపడ్డారా?’ అని ప్రశ్నించారు.అయితే, టీడీపీకి చెందిన కొందరు నేతలు తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంను కలవడానికి అనుమతి కోరగా..ఆయన వారితో సమావేశమవడానికి నిరాకరించారు. లోక్‌సభలో అన్నాడీఎంకే సంఖ్యా బలం 37. భాజపా, కాంగ్రెస్‌ తర్వాత అత్యంత ఎక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీ అదే కావడంతో అవిశ్వాసానికి మద్దతివ్వాలని టీడీపీ కోరింది. దీంతో పళనిస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో పాల్గొనకుండా ఏఐడీఎంకేతోపాటు బిజు జనతాదళ్‌ పార్టీ కూడా దూరంగా ఉండాలని నిర్ణయిం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే అవిశ్వాసంపై జరిగే చర్చలో పాల్గొనే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ చర్చ సందర్భంగా ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపాలని అన్నాడీఎంకే భావిస్తున్నట్లు సదరు వర్గాలు పేర్కొంటున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అవిశ్వాసంపైనే చర్చ జరపాలని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ నిర్ణయించారు

Related Posts