విజయవాడ భవానీపురంలోని ఆలివ్ ట్రీ హోటల్ పై దాడి చేసి, అసభ్యకరంగా నృత్యాలు చేస్తున్న యువతులు సహా పదుల సంఖ్యలో పురుషులను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. విజయవాడలో పట్టుబడిన తొలి ముజ్రా పార్టీగా పోలీసులు దీన్ని రిజిస్టర్ చేశారు. ఇక అరెస్టయిన వారిలో ఈవెంట్ యాంకర్లతో పాటు హైదరాబాద్, భీమవరం ప్రాంతాల నుంచి తెప్పించిన అమ్మాయిలు ఉన్నారని, వారిని వాసవ్య మహిళా మండలికి అప్పగించామని పోలీసులు వెల్లడించారు. అరెస్టయిన వారిలో స్థానిక తెలుగు దేశం పార్టీ నేతలు, వ్యాపారులు కూడా ఉన్నారు. విజయవాడ జాయింట్ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా ఆధ్వర్యంలో దాడులు జరుగగా, అక్కడ పెద్దఎత్తున మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.