ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన 8 మంది ఐపీఎస్ అధికారులు ఈ ఏడాదిలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ వివరాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. జాబితాలో డీజీపీ డా. ఎం.మాలకొండయ్య కూడా ఉన్నారు.ఐపీఎస్ అధికారులలో కె. కోటేశ్వర రావు ఈ నెల 31న పదవి విరమణ చెందనున్నారు.ఈయనతో పాటుగా బి .వీ. రమణ కుమార్ ఫ్రిబ్రవరి 28 న, షేక్ మహ్మద్ ఇక్బల్ ఏప్రిల్ 30 న , డా . ఎం.మాలకొండయ్య జూన్ 30 న , ఎం . సుబ్బారావు జులై 31 న ,టీ. యోగానంద్ ఆగస్టు 31 న , ఎస్.వీ. రమణ మూర్తి సెప్టెంబర్ 31 న , జె. బ్రహ్మ రెడ్డి నవంబర్౩౦ న పదవి విరమణ చేయనున్నారు.