- సారలమ్మను దర్శించుకోకుండానే వెనుదిరిగిన రమణ్ సింగ్.
ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం జాతరకు గురువారం వచ్చిన ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్కు తృటిలో ప్రమాదం తప్పింది . క్యూలైన్ నిలిపివేయకపోవడంతో సమ్మక్క గద్దెపై భక్తులు విసిరే కొబ్బరి కాయల నుంచి తప్పించుకున్న రమణ్ సింగ్. సెక్యూరిటీ అప్రమత్తతతో ఈ ప్రమాదం తప్పింది . సారలమ్మను దర్శించుకోకుండానే వెనుదిరిగిన రమణ్ సింగ్ వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ ఘటనతో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇదిఇలా ఉండగా సమ్మక్క గద్దెను చేరుతుంది. మేడారం భక్త జనసంద్రంగా మారింది.కాగా శుక్రవారం రోజున ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి ఓరం రేపు జాతరకు రానున్నారు. ఈ నేపథ్యంలో గద్దెల ప్రాంగణం సమీపంలో తాత్కాలిక హెలిప్యాడ్‌లు నిర్మిస్తున్నారు. మేడారంను సందర్శించిన డీజీపీ మహేందర్‌రెడ్డి హెలిప్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించారు. ఉపరాష్ట్రపతి, గవర్నర్, సీఎం, కేంద్రమంత్రి పర్యటన ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ సీతారాంనాయక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.