YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శ్రీ రామదూత సమూహం.. శ్రీ రామ నామ మహత్మ్యం..!!

 శ్రీ రామదూత సమూహం.. శ్రీ రామ నామ మహత్మ్యం..!!

ఒక్క రామనామం నాలుక మీద నర్తిస్తే ఆ నామం నర్తించిన కారణం చేత సమస్తపాపములనుండి వినిర్ముక్తుడు కావచ్చు. ఒక్క రామనామం స్మరణతో లెక్కలేనన్ని లాభాలు చేకూరుతాయి. రామనామ గర్జన ఉన్నచోట విష్ణువు సుదర్శన చక్రం తిరుగుతుంది. దీనులను రక్షించేది ఈ రామనామమే.
"రామనామం ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందని సత్పురుషులు, పురాణాలు, ఉపనిషత్తులు గానం చేశాయి. జ్ఞానగుణరాశి అయిన శివుడు సతతము దీన్ని జపిస్తాడు. రామరక్షాస్తోత్రంలో శంకరుడు పార్వతికి రామనామ మహత్వాన్ని చెప్తూ విష్ణువు యొక్క వెయ్యినామాలు ఒక్క రామనామంతో సమానమని" అన్నాడు.
'శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే'
ఈ నామం వల్ల స్వరూపం ప్రాప్తిస్తుంది. భగవంతునియొక్క నామము సర్వకాల సర్వావస్థలయందు అవసరమే. ఒకమంత్రం చేయడానికి, అంగన్యాస కరన్యాసాలు, కాళ్ళూ చేతులు కదపకుండా కూర్చొని చేయాలి. అదే ఒక భగవన్నామం చెప్పడానికి యే అవస్థలోనైనా చెప్పవచ్చు.
రామా! నీదివ్యమైన నామాన్ని నా నాలుకమీద నర్తింపచెయ్యి అంటాడు. ఆ ఒక్క నామాన్ని పట్టుకొని భగవన్నామాన్ని సతతం జపించిన కారణం చేత సమస్త పాపములనుండి విడుదలై యోగమార్నాన్ని, అష్టాంగ యోగాని అవలంబించే ఋషులు, యోగులు, సిద్ధులు, శక్తిసంపన్నులైన బ్రహ్మాది దేవతలు కూడా చేరుకోలేని మోక్షలోకమైన విష్ణులోకాన్ని  చేరగలడు. రామనామము అంతగొప్పది. భగవన్నామాన్ని ఉచ్ఛరించగలిగిన స్థితి ఒక్క మనుష్య ప్రాణికే వుంది. ప్రతిరోజూ శ్రీరామ నామాన్ని ‌స్మరించండి, తరించండి, ఆనందంగా జీవించండి.
 హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
 రామ రామ హరే హరే

Related Posts