YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

1100 డిగ్రీ కాలేజీల్లో స్టూడెంట్స్ బయోమెట్రిక్

1100 డిగ్రీ కాలేజీల్లో స్టూడెంట్స్ బయోమెట్రిక్
 రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలు చేయాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,100కు పైగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో దీని అమలుకు చర్యలు చేపట్టనుంది. టీఎస్‌టీఎస్‌ నుంచి బయోమెట్రిక్‌ మిషన్లను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించింది. ఒక్కో మిషన్‌కు నెలకు రూ.1,000 చొప్పున వెచ్చించి వీటిని ఏర్పాటు చేయనుంది.  డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులకు బయోమెట్రిక్‌ హాజరు అమలు చేయాలని కళాశాల విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి బయోమెట్రిక్‌ అమలుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 131 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో 200 మంది విద్యార్థులకు ఒకటి చొప్పున బయోమెట్రిక్‌ మిషన్లు ఏర్పాటు చేయనున్నారు. రెండో దశలో ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లోనూ దశలవారీగా బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేయాలని విద్యాశాఖ భావిస్తోంది.ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి పోటీ పరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు కళాశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా సివిల్స్‌లో శిక్షణ ఇవ్వాలన్న ఆలోచన చేస్తోంది. ప్రత్యేక పరీక్ష ద్వారా 50 లేదా 100 మంది విద్యార్థుల్ని ఎంపిక చేసి శిక్షణనిచ్చేలా చర్యలు చేపడుతోంది. డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నేరుగా భర్తీ చేసేందుకు కళాశాల విద్యాశాఖ నిర్ణయించినట్లు సమాచారం. ముందుగా పదోన్నతుల ద్వారా భర్తీ చేసి, మిగిలిన పోస్టులను డైరెక్టు రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేయనుంది. ఇందుకోసం నియమ నిబంధనల్లో సవరణ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు తెలుస్తోంది.డిగ్రీలో యూనివర్సిటీ యూనిట్‌గా ఆన్‌లైన్ ప్రవేశాల విధానాన్ని అమలు చేయాలి. ఇందుకోసం ప్రతి జిల్లాలో మూడు వరకు హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఇంటర్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.కామన్ అకడమిక్ కేలండర్ ప్రకారమే అన్ని యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ప్రవేశాలు, విద్యా బోధన, పరీక్షలు జరగాలి. డిగ్రీలో సెమిస్టర్ విధానం అమలు చేస్తారు. ఒక్కో సెమిస్టర్‌లో 90 రోజుల పనిదినాలు ఉంటాయి. ఏటా రెండు సెమిస్టర్లు ఉంటాయి. మొదటి సెమిస్టర్ పరీక్షలు నవంబర్‌లో, రెండో సెమిస్టర్ పరీక్షలు తర్వాతి ఏడాది ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లోనూ సెమిస్టర్ విధానం ఉంటుంది.ప్రశ్నపత్రాలను మాత్రం యూనివర్సిటీల వారీగా తయారుచేసుకుని... కామన్ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి.విద్యార్థులకు ప్రతి సెమిస్టర్‌లో 75 శాతం హాజరు ఉండాల్సిందే. లేకపోతే పరీక్షలకు అనుమతించరు.విద్యార్థులు, లెక్చరర్లకు కాలేజీలు బయోమెట్రిక్ విధానం అమలు చేయాలి. ఈ హాజరు డాటాను యూనివర్సిటీకి, కళాశాల విద్యాశాఖకు, ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌కు ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలి.ప్రతి కాలేజీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.బోగస్ విద్యార్థులు, రెండు మూడు చోట్ల ప్రవేశాలను నిరోధించేందుకు విద్యార్థుల ఆధార్ నంబర్ తీసుకోవాలి. భవిష్యత్తులో అవసరమైతే ఈ డాటాను ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన ఈ పాస్ వెబ్‌సైట్‌కు అనుసంధానం చేస్తారు.

Related Posts