YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మోడీపై లోకేష్ కౌంటర్

మోడీపై లోకేష్ కౌంటర్
అవిశ్వాసంతో హస్తిన హీటెక్కింది. యావత్ దేశం మొత్తం లోక్‌సభలో జరుగుతున్న పరిణామాలను ఆసక్తికరంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా, విభజన హామీలతో ముడిపడిన అంశం కావడంతో.. సీఎం చంద్రబాబు, మంత్రులు ఢిల్లీ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఇటు పశ్చిమగోదావరి జిల్లా పర్యటనను రద్దు చేసుకున్న మంత్రి లోకేష్ తిరిగి అమరావతికి వచ్చేశారు. సభలో టీడీపీ ఎంపీ ప్రసంగంతో పాటూ.. అక్కడి పరిణామాలపై ట్విట్టర్ ద్వారా స్పందించారు. వరుస ట్వీట్లలో తన అభిప్రాయాలను తెలియజేశారు. ఆ ట్వీట్లలో.. టీడీపీ-బీజేపీ మధ్య యుద్ధం కాదని.. మోదీ పాలన-ఐదుకోట్ల ఏపీ ప్రజల మధ్య జరుగుతున్న యుద్ధమని గల్లా జయదేవ్ కరెక్ట్‌గా చెప్పారని అభినందించారు. పార్లమెంట్‌లో రూపొందించిన చట్టంలో.. అదే పార్లమెంట్ సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీల కోసమే ఈ వార్ జరుగుతోందన్నారు. మోదీ ఇచ్చిన హామీలనే అమలు చేయమని మేం అడుగుతున్నాం.. వాళ్లే 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దాదాపు నాలుగేళ్లవుతోంది.. ఇప్పటి వరకు వాటిని నెరవేర్చలేదు. ఏపీ అంటే అంత చిన్న చూపు ఎందుకు అని ప్రశ్నించారు. అంతకముందు చేసిన ట్వీట్లలో.. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రధాని మోదీ నాయకత్వంలో ఏర్పడే ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మే ఎన్డీఏలో చేరామన్నారు లోకేష్. ఏపీకి న్యాయం చేయమని కోరాం.. వేచి చూశాం.. చంద్రబాబు 30సార్లు ఢిల్లీకి వెళ్లినా ఉపయోగం లేదు. వాళ్లతో కలిసినందుకు మాకు ఏం ఇచ్చారు. నకిలీ వాగ్థానాలు, అబద్ధపు హామీలు, నకిలీ నవ్వులు నవ్వుతున్నారు. ఇంతకు మించి ఒరిగింది ఏమీ లేదన్నారు. ఇప్పటికైనా మీ డ్రామాలు, టైంపాస్ వ్యవహారాలు ఆపండి. ప్రతి తెలుగోడు రాష్ట్రం కోసం పోరాటం చేస్తాడు. ఏపీకి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానన్నారు మంత్రి. 

Related Posts