వన్డే క్రికెట్ చరిత్రలోనే అద్భుత రికార్డు సృష్టించింది పాకిస్తాన్. ప్రస్తుతం పాకిస్తాన్ జింబాబ్వే పర్యటనలో ఉంది. జింబాబ్వేతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా.. ఈ రోజు జరుగుతున్న నాలుగొ వన్డే లో తొలి వికెట్‌కు ఏకంగా 304 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న పాకిస్థాన్ చెలరేగి ఆడింది. ఓపెనర్లు ఇమాముల్ హక్ (113), ఫకర్ జమాన్ (210) దంచి కొట్టారు. 122 బంతులు ఎదుర్కొన్న ఇమాముల్ హక్ 8 ఫోర్లతో సెంచరీ (113) పరుగులు చేయగా, ఫకర్ జమాన్ 156 బంతుల్లో 24 ఫోర్లు, 5 సిక్సర్లతో డబుల్ సెంచరీ (210) సెంచరీ చేశాడు. దీంతో పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 399 పరుగులు చేసింది. దీంతో శ్రీలంక ఓపెనర్లు జయసూర్య-తరంగ నమోదు చేసిన 284 పరుగులు అత్యధిక ఓపెనింగ్ వికెట్ భాగస్వామ్యం బద్దలైంది.
మరో వైపు పాకిస్తాన్ తరపున వన్డే లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా ఫకర్ జమాన్ (210) రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు తొలుత షాహిద్ అన్వార్ ( 194 ) పేరిట ఉండేది.