శ్రీలంకలోని గాలె స్టేడియం ఇక కనుమరుగు కానుంది. ప్రపంచంలోని మేటి క్రికెట్ స్టేడియాలలో ఈ స్టేడియం ఒక్కటి. ఈ స్టేడియం లో ఉన్న పెవిలియన్ స్టాండ్ కారణంగా యునెస్కో గుర్తింపు పొందిన 17వ శతాబ్దం నాటి కోటకు ముప్పు పొంచి ఉండడంతో దానిని కూల్చివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం గాలెలో మరో స్టేడియంను నిర్మించనున్నట్టు మంత్రి తెలిపారు. ఈ పెవిలియన్ కోటకు ముప్పుగా మారిందని ప్రభుత్వం తెలిపింది.
గాలె స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామం. 1998 నుంచి ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఆడిన మ్యాచుల్లో అత్యధిక శాతం మ్యాచులను శ్రీలంక గెలుచుకుంది. స్టేడియాన్నిఇప్పటికిప్పుడు కూల్చబోమని క్రీడల మంత్రి ఫెయిస్‌జెర్ ముస్తాఫా తెలిపారు.