తెలంగాణ పంచాయతీరాజ్‌లో 151 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గురువారం అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ మినహా జిల్లాల్లో 77 జూనియర్ అసిస్టెంట్, 74 టైపిస్ట్ పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది.