నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కులదోస్తామన్నది డాంబికాలని నిన్న తేలిపోయింది. ఆంధ్రా కు నిజమైన దోషులెవరో తేలిపోయిందని బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి చెప్పారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ చిన్న రాష్టలను నమ్మింది.. అందుకే కాకినాడ తీర్మానమ్ చేసాం. చంద్రబాబు ను రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.. ఎవరికి ధన్యవాదాలు తెలపడానికి ఢిల్లీ వెళ్లారని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ధన్యవాదాలు తెలపడానికి ..చంద్రబాబు వెళ్లడం హాస్యాస్పదం. ఎన్టీఆర్ ఎవరికి వ్యతిరేకంగా పార్టీ స్థాపించారో వారి మద్దతు తో అవిశ్వాసం పెట్టడాన్ని ఆమె తప్పు పట్టారు. పార్లమెంట్ లో ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని ఆమె విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఏది అడిగిన ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉంది. మోడీ ని కించపరిచేలా మాట్లాడటం తగునా అని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసత్య పునాదుల మీద పరిపాలన సాగిస్తోంది. ఆనాడు..రాష్ట్ర విభజనకు మీరు ఉత్తరం ఇవ్వలేదా అని ఆమె నిలదీసారు.
ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీతోనూ తమకు పొత్తు లేదని ఆమె స్పష్టం చేసారు. తమకు ఎవరితోనూ లోపాయికారీ ఒప్పందాలు లేవని ఆమె అన్నారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆమె అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు అమిత్షా తమకు చెప్పిన మేరకు రాష్ట్రంలోని 175 శాసనసభ స్థానాల్లో, 25 పార్లమెంటు స్థానాల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆమె చెప్పారు. దుగ్గరాజ పట్నం పోర్ట్ ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వం కారణం. కడప స్టీల్ ప్లాంట్ కు జాప్యం .. మీ వల్ల కాదా అని అడిగారు. రైల్వే జోన్ ఖచ్చితంగా ఇస్తాం. అబివృద్ది విషయంలో మేము రాజకీయం చెయ్యం. చెయ్యబోం. రఫెల్ ఒప్పందం లో కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోంది..అవాస్తవాలు చెప్పిందని ఆమె అన్నారు.