ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం ఎవరు పోరాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారన్నారు ఏపీ మంత్రి దేవినేని ఉమ. అవిశ్వాసం విషయంలో టీడీపీపై చేసిన విమర్శలకు ఆయన కౌంటరిచ్చారు. ‘బీజేపీతో కలిసి టీడీపీ డ్రామాలాడుతుందని జగన్ అంటున్నారు.. కుమ్మక్కు రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ఆయన మాటలు వింటుంటే అర్థమవుతోంది. అసెంబ్లీకు రారు.. పార్లమెంట్‌కు పోరు.. మరి ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలపై ఎక్కడ మాట్లాడాతురో ఆ పార్టీ నేతలే చెప్పాలి‘వైసీపీ ఎంపీల రాజీనామాతో వాళ్ల పలాయనవాదం ఏంటో బయటపడింది. ఎవరు కేంద్రంతో కలిసి డ్రామాలాడుతున్నారో అర్థమవుతుంది. టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తుంటే.. రాజీనామా చేసిన ఎంపీలు ఇళ్లలో కూర్చొన్నారు. సొంత పార్టీ వాళ్లే జగన్‌పై కోపంతో ఉన్నారు. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.. అధికారం ఉందని మొండిగా వెళుతోంది. ప్రధాని కూడా రాష్ట్రానికి ఏం ఇచ్చేది లేదని చెప్పడం దారుణం. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది బీజేపీనే.. ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారు. కేంద్రం తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేస్తాం.. రాష్ట్రానికి బీజేపీ చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరిస్తాం. కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామన్నారు’ఉమ.