- బడ్జెట్ - 2018-2019 ముఖ్యాంశాలు..
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ 2018-2019 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు.వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య,ఉపాధి, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు,మౌలిక సదుపాయాల రంగాలను బలోపేతం చేసే లక్ష్యమార్గ నిర్దేశంతో బడ్జెట్‌సాగింది. పలు నిర్మాణాత్మక సంస్కరణలు భారత దేశాన్నిప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ఆర్థిక వ్వవస్థల సరసన నిలబెట్టగలవని ప్రభుత్వం తెలిపింది. తయారీ, సేవలు,ఎగుమతుల రంగాలు తిరిగి మంచి అభివృద్ధి పథంలోకి వచ్చినందున దేశం తప్పకుండా 8శాతం ప్రగతిని సాధించగలదని ప్రభుత్వం తెలిపింది.
మెజారిటీ రబీ పంటలమాదిరే, ఇప్పటివరకు కనీస మద్దతు ధర ప్రకటించని ఖరీఫ్ పంటలకు ,వాటి ఉత్పత్తి ధరకు ఒకటిన్నర రెట్లు ఉండేట్టు చూస్తారు. వ్యవస్థాగత వ్యవసాయ రుణం 204-15 సంవత్సరంలో 8.5 లక్షల కోట్ల రూపాయలు ఉన్న దానిని 2018-2019 లో 11 లక్షల కోట్ల రూపాయలకు పెంచుతారు.86 శాతం చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుక 22000గ్రామీణ బహిరంగ మార్కెట్‌లను గ్రామీణ వ్యవసాయ మార్కెట్‌ల స్థాయికి పెంచనున్నారు. ఆలు, టమాటా, ఉల్లి ధరలలో హెచ్చుతగ్గుల సమస్యను ఎదుర్కొనేందుకు ,రైతులు,వినియోగదారుల ప్రయోజనార్థం ఆపరేషన్ గ్రీన్స్‌ను ప్రారంభించడం జరిగింది.మత్స్య, పశుసంవర్థక రంగాలకు 10,000కోట్ల రూపాయలతో రెండు నిధులను ప్రకటించడం జరిగింది. పునర్ వ్యవస్థీకరించిన జాతీయ వెదురు మిషన్‌కు 1290 కోట్ల రూపాయలు అందుతుంది.మహిళా స్వయం సహాయక బృందాలకు అందించే రుణాలు గత సంవత్సరం నాటి42,500 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుతం75,000 కోట్ల రూపాయలకు పెంచడం జరుగుతుంది. దిగువ, మధ్యతరగతి ప్రజలకు ఉచిత ఎల్‌పిజి కనెక్షన్లు, ఉచిత విద్యుత్, ఉచిత మరుగుదొడ్ల సౌకర్యం కల్పించేందుకు ఉజ్వల,సౌభాగ్య, స్వచ్ఛ మిషన్‌ల లక్ష్యాల పెంపు ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత కేటాయింపులు 1.38 లక్షల కో్ట్ల రూపాయలుగా ఉండనున్నాయి.
2022 నాటికి ప్రతి గిరిజన బ్లాక్‌లో గిరిజన విద్యార్థులకు ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలలు అందుబాటులోకి వస్తాయి. షెడ్యూలు కులాల వారి సంక్షేమానికి నిధులు మరింతగా పెరిగాయి.సెకండరీ, టెరిటియరీ స్థాయి వైద్య చికిత్సకు సంబంధించి పది కోట్ల మంది పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన 10 కోట్ల కుటుంబాలకు కుటుంబానికి ఐదులక్షల రూపాయల పరిమితితో ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య సంరక్షణ పథకాన్ని ప్రకటించడం జరిగింది. ద్రవ్యలోటు 3.5 శాతం వద్ద ఉంది. 2019-2019 సంవత్సరానికి ఇది 3.3 శాతంగా ఉంటుందని అంచనా. మౌలిక సదుపాయాల రంగానికి 5.97 లక్షల కోట్ల రూపాయల కేటాయింపు. మహోన్నత పర్యాటక కేంద్రాలుగా పది ప్రముఖ ప్రాంతాల అబివృద్ది. కృత్రిమ మేధస్సుకు సంబంధించి నీతి ఆయోగ్ జాతీయస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.రోబోటిక్స్, ఎఐ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ తదితరాలపై సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు పెట్టుబడుల ఉపసంహరణ 72,500 కోట్ల రూపాయల లక్ష్యాన్ని అధిగమించం 1,00,000కోట్లకు చేరుకోనుంది. బంగారాన్ని అసెట్ తరగతిస్థాయికి అభివృద్ధి చేసేందుకు బంగారానికి సంబంధించి సమగ్ర విధానానికి రూపకల్పన జరుగుతోంది. రైతు ఉత్పాదక కంపెనీలుగా నమోదై, వాటి వార్షిక టర్నోవర్ 100 కోట్ల రూపాయల వరకు ఉంటే, అలాంటి సంస్థల కార్యకలాపాలనుంచి ఆర్జించే లాభంపై 2018-19 నుంచి ఐదు సంవత్సరాల పాటు నూరు శాతం మినహాయింపును ప్రతిపాదించడం జరిగింది. మరింత మందికి ఉపాధి కల్పించే లక్ష్యంతో పాదరక్షలు, తోలు పరిశ్రమకు సంబంధించి సెక్షన్80 జెజె ఎఎ కింద కొత్త ఉద్యోగులకు చెల్లించే మొత్తంపై 30 శాతం మినహాయింపును 150రోజుల వరకు సడలిస్తూ ప్రతిపాదించారు.స్థిరాస్తిరంగానికి సంబంధించి ప్రతిపాదిత చెల్లింపుమొత్తంలో సర్కిల్ రేటువిలువ 5శాతానికి మించని సందర్బంలో సర్దుబాటు ఉండదు సూక్ష్మ , చిన్న, మధ్యతరహా సంస్థలకు ప్రయోజనం కలిగించేందుకు ప్రస్తుతం 50 కోట్ల రూపాయల లోపు టర్నోవర్ కలిగిన కంపెనీలు (2015-16 సంవత్సరంలో) అందుకుంటున్న 25శాతం తగ్గింపు రాయితీని 2016-17సంవత్సరలో 250 కోట్ల రూపాయల టర్నోవర్ వరకు ఆర్జిస్తున్న సంస్థలకూ వర్తింపచేసేందుకు ప్రతిపాదించారు. ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, మిసిలేనియస్ వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపు కింద లభిస్తున్న ప్రస్తుత మినహాయింపు స్థానంలో ప్రతిపాదించిన40,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్‌వల్ల 2.5కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం. సీనియర్ సిటిజన్లకు ప్రతిపాదించిన ప్రయోజనాలు..బ్యాంకులు, పోస్లాఫీసులలో ఉన్న డిపాజిట్లపై వడ్డీ రాబడిపై పన్ను మినహాయింపును 10 వేల రూపాయల నుంచి50 వేల రూపాయలకు పెంపు సెక్షన్ 194 ఎ కింద టిడిఎస్ మినహాయించాల్సిన అవసరం లేదు. అన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాలు, రికరింగ్ డిపాజిట్ పథకాలవడ్డీపై ప్రయోజనం అందుతుంది. ఆరోగ్య బీమా ప్రీమియం విషయంలో మినహాయింపు పరిమితిని, వైద్య ఖర్చుల మినహాయింపు పరిమితిని సెక్షన్ 80 డి కింద30,000 రూపాయల నుంచి 80,000రూపాయలకు పెంచారు. కొన్ని రకాల తీవ్ర జబ్బుల విషయంలో వైద్య ఖర్చుల మినహాయింపు పరిమితిని (సీనియర్ సిటిజన్లకు)రు60,000నుంచి,( మరీ సీనియర్ సిటిజన్లకు) 80,000నుంచి లక్ష రూపాయలకు అందరు సీనియర్ సిటిజన్లకు సెక్షన్ 80డిడిబి కింద పెంచారు.ప్రధానమంత్రి వయ వందన యోజన పథకాన్ని2020 మార్చి వరకు పొడిగించాలని ప్రతిపాదించారు. ఇందులో పెట్టుబడికి ప్రతి సీనియర్ సిటిజన్‌కు ప్రస్తుతం ఉన్న పరిమితిని 7.25 లక్షల రూపాయలనుంచి 15 లక్షల రూపాయలకు పెంచాలని ప్రతిపాదించారు.ఐఎఫ్ ఎస్‌సిలో ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్‌లలో ట్రేడ్‌ను పెంపొందించేందుకు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎప్ెస్‌సి)కి మరిన్ని రాయితీలు ఇవ్వడానికి ప్రతిపాదించడం జరిగింది.
*నగదు ఆధారిత ఆర్థిక కార్యకలాపాలను నియంత్రించడానికి ట్రస్లులు, ఇతర సంస్థలు పది వేల రూపాయలకు మించి నగదు చెల్లింపులను అనుమతించబోరు. అలాగే దానిని పన్ను పరిధికిందికి తెస్తారు. లక్ష రూపాయలకు మించిన దీర్ఘకాలిక కేపిటల్ గెయిన్స్‌పై పదిశాతం వంతున పన్ను విధిస్తారు. దీనికి ఎలాంటి ఇండెక్సేషన్ ప్రయోజనం లభించదు. అయితే 2018 జనవరి 31 వరకు వచ్చిన అన్ని రాబడులను కలుపుతారు. ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ పంచే ఆదాయంపై పది శాతం వంతున పన్ను విధింపునకు ప్రతిపాదించారు.వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేషన్ టాక్స్‌పై సెస్సును ప్రస్తుతం ఉన్న 3 శాతం స్థాయినుంచి 4శాతం స్థాయికి పెంచాలని ప్రతిపాదించారు.ప్రత్యక్ష పన్నుల సేకరణలో మరింత పారదర్శకతను సాధించేందుకు, సమర్ధతను పెంచేందుకు వ్యక్తులు ఎవరినీ కలుసుకునే అవసరం లేకుండా దేశవ్యాప్తంగా ఈ అసెస్‌మెంట్‌ను తీసుకువచ్చేందుకు ప్రతిపాదింపబడింది. దేశంలో మరిన్ని ఉద్యోగాలు కల్పించేందుకు ప్రోత్సహించడానికి కస్టమ్స్ సుంకం విధానంలో మార్పులు ప్రతిపాదింపబడ్డాయి. దేశీయంగా వాల్యూ అడిషన్‌కు, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్,ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఫుట్‌వేర్, ఫర్నిచర్ రంగాలలో మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహకాలు ప్రతిపాదించారు.
కేంద్ర బద్రడ్జెట్లో తెలుగు వాడి విలువ రూ.91.00/-
ఏపీ సెంట్రల్ వర్సిటీ కి 10 కోట్లు
ఏపీ ట్రైబల్ వర్సిటీ కి. 10
ఏపీ నిట్ కి 54
ఏపీ ఐఐఐటీ కి 30
ఐఐటీ కి 50
ఐఐఎం 42
ఐఐఎస్ సీఆర్ కి 49
పెట్రోలియం యూనివర్సిటీ కి 32
ప్యాకెజింగ్ వర్సిటీ కి 5
విశాఖ పోర్ట్ కి 108
డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కి 19.62
----------
మొత్తం 409.62 కోట్లు.
షుమారు 4.5 కోట్లు జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ కి 409.62 కోట్ల భారీ కేటాయింపులు.
సగటున ఒక్కొక్కరికి 91రూపాయిలు..ఇంకో 9 వేసి 100 చొప్పున కూడా ఇవ్వలేక పోయారు......
రైలు బడ్జెట్ లో కోనసీమ కేటాయింపులు కూడా కంటి తుడుపే

**