హిందీ టీవీ నటుడు సిద్దార్ద్ శుక్లా తన ర్యాష్ డ్రైవింగ్‌తో కారు ప్రమాదానికి కారణమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నటుడిని అదుపులోకి తీసుకున్నారు. కారు నడుపుతున్న సమయంలో సిద్దార్ద్ శుక్లా తాగి ఉన్నాడా? లేదా? అని తెలుసుకోవటానికి అతని రక్తాన్ని వైద్యపరీక్షల నిమిత్తం పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆయన కారుతో పాటు మరో మూడు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఓ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.