కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన జీఎస్టీ 28వ మండలి సమావేశం ముగిసింది. మహిళల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా శానిటరీ నాప్‌కిన్స్‌పై జీఎస్టీ నుంచి మినహాయింపు ఇచ్చినట్టు పేర్కొన్నారు. బలవర్ధకమైన పాలు, విస్తరాకులపై జీఎస్టీ పన్ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కాగా కొత్తగా ప్రకటించిన తగ్గింపు రేట్లు జూలై 27 నుంచి అమలులోకి రానున్నాయి. వెయ్యి రూపాయల లోపు ధరకు విక్రయించే పాదరక్షలను 5 శాతం జీఎస్టీ పరిధిలోకి తెచ్చింది.
లిథియం బ్యాటరీలు, వాక్యూమ్ క్లీనర్లు, మిక్సర్ గ్రైండర్లు, వాటర్ హీటర్లు, వాషింగ్ మిషన్లు,హెయిర్ డ్రైయర్లు, కూలర్లు, పాలు, ఐస్ క్రీమ్, సుగంధ ద్రవ్యాలు, బాత్రూంలను శుభ్రపరిచే రసాయనాలు, రంగులు, వార్నిష్ లను 28 శాతం పన్ను పరిధి నుంచి 18 శాతం పన్ను పరిధిలోకి చేర్చింది.