అభిమానులకు సూపర్‌స్టార్ రజనీకాంత్ భారీ షాకే ఇచ్చారు. రాజకీయాలపై దృష్టిసారించిన ఆయన త్వరలో పార్టీ ఏర్పాటును ఓ కొలిక్కి తేవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అభిమానులకు ఝలక్ తగిలినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరపున సీట్లు ఆశించొద్దనే ఆయన అభిమాన సంఘాలకు స్పష్టం చేశారంట. ఈ విషయాన్ని రజనీ ఫ్యాన్స్ క్లబ్ ప్రతినిధి ఒకరు శనివారం ధృవీకరించగా.. ఓ ప్రముఖ వెబ్‌సైట్ కథనం ప్రచురించింది. ‘ఈ విషయంలో ఆయన చాలా కఠినంగా ఉన్నారు. సుదీర్ఘంగా అభిమానులుగా ఉన్నవాళ్లు, ఫ్యాన్స్ కమిటీ చైర్మన్లు, ఫ్యాన్స్ క్లబ్ ప్రెసిడెంట్లు టికెట్లు ఆశించొద్దని మొన్నీమధ్య జరిగిన సమన్వయ కమిటీలో రజనీ తేల్చి చెప్పారు