లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తన ప్రసంగాన్ని ముగించిన రాహుల్ గాంధీ... నేరుగా ప్రధాని వద్దకు వెళ్లి, ఆయనను కౌగిలించుకున్న సంగతి తెలిసిందే. ఘటనపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోదీ వెంటనే ఆసుపత్రికి వెళ్లి, వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రధానమంత్రికి ఇబ్బంది కలిగే విధంగా రాహుల్ ప్రవర్తించారని ఆయన అన్నారు.ముమ్మాటికీ ఇది అనైతిక చర్య అని, ఇలాంటి చర్యలను అందరూ ఖండించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పారు.