సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా మరో బయోపిక్ తెరకెక్కిస్తానని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ మధ్య ప్రకటించారు. సంజయ్ దత్ అక్రమ ఆయుధాల కేసు నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోందని కూడా వర్మ క్లూ ఇచ్చారు. ఈ ప్రకటనపై సంజయ్ దత్ సోదరి నమ్రతా దత్ మండిపడ్డారు. అక్రమాయుధాల కేసు అనేది సంజయ్ జీవితంలో ఓ బాధాకరమైన ఘటన అని, దీని గురించి వర్మ ఎందుకు తీయాలనుకుంటున్నారని మండిపడ్డారు. వర్మ సినిమాల్లో చూపించేదంతా చీకటి కోణాలేనని, సంజయ్ ను బాధపెట్టాలనుకుంటున్నారా? మమ్మల్ని మళ్లీ బాధలోకి నెట్టాలని చూస్తున్నారా? అంటూ వర్మపై సంజయ్ సోదరి ఆగ్రహం వ్యక్తం చేశారు.