ఇప్పటికే ఆర్థికపరమైన సమస్యలతో కొట్టు మిట్టాడుతున్న ఎయిరిండియా సంస్థకు మరో షాక్ తగిలింది. విమా నంలో నల్లులు ఉన్నాయంటూ ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేయడం తో.. అమెరికాలోని నెవార్క్ నుంచి ముంబై రావాల్సిన పలు సర్వీసుల ను రద్దు చేశారు. నెవార్‌క నుంచి ఎయిరిండియా విమా నంలో పొవాయ్‌కు చెందిన కశ్మీరా టోన్సెకర్ ఓ కుటుంబం ముంబైకి బిజినెస్ క్లాస్‌లో బయలుదేరింది.మధ్యలో టోన్సెకర్ కుమార్తెకు నల్లులు కుట్టడంతో చర్మంపై దద్దుర్లు వచ్చాయి. తొలుత ఏవో పురు గులు ఉన్నాయని గుర్తించి సిబ్బందికి ఫిర్యాదు చేశామని, వారు క్రిమి సంహారక మందు చల్లారని, కానీ కాసేపటికే చాలా నల్లులు బయటకు వచ్చాయని టోన్సెకర్ తెలిపారు. నల్లులు కనిపించడంపై విమాన సిబ్బంది కూడా ఆశ్చర్యపోయారని, తమను బిజినెస్ క్లాస్ నుంచి ఎకా నమీ క్లాస్‌కు మార్చారని తెలిపారు. దీనిపై సంస్థకు ఫిర్యాదు చేశామ న్నారు. ముంబై నుంచి నెవార్క్ వెళ్లిన ఎయిరిండియా విమానంలోనూ ఇలాంటి పరిస్థితే నెల కొంది. దాంతో కీటకాలు ఉన్నట్లు ఫిర్యాదులు అందుకున్న రెండు విమానాలను ఒక రోజు పాటు నిలిపేసి వాటిని శుభ్రంచేసి క్రిమిసంహారకాలు స్ప్రే చేశామని అధికారులు తెలిపారు.