YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జ‌గ‌న్ వాద‌న‌తో టీడీపీకి కష్టకాలమే

జ‌గ‌న్ వాద‌న‌తో టీడీపీకి కష్టకాలమే
రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా, పారిశ్రామిక రాయితీలు, విభ‌జ‌న చ‌ట్టంలోని హామీల అమ‌లు వంటి కీల‌క విష‌యాల్లో కేంద్రం పై పోరాడేందుకు జ‌గ‌న్ అనుస‌రిస్తున్న వైఖ‌రికి జ‌నాలు జై కొడుతున్నారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్ట‌డం ద్వారా చంద్ర‌బాబు ఏదో సాధిస్తార‌ని అంద‌రూ అనుకున్నా.. ఏమీ కాక‌పోగా.. అది బూమ‌రాంగ్ మాదిరిగా.. చంద్ర‌బాబు వైఖరి ప్ర‌జ‌ల ముందు సాక్షాత్క‌రించింది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్ చేసిన ఎంపీల రాజీనామా, పార్ల‌మెంటులో అవిశ్వాసం వంటి కీల‌క విష‌యాల‌ను ప్ర‌జలు ఇప్ప‌టికీ మ‌రిచిపోలేకపోతున్నారు.పార్ల‌మెంటులో జ‌రిగిన ప‌రిణామాల‌పై తాను బాధ‌ప‌డ్డాన‌ని చెప్ప‌డం ద్వారా.. జ‌గ‌న్‌.. వైఖ‌రి ఏంటో స్ప‌ష్టంగా తెలుస్తోంద‌నేది విశ్లేష‌కుల మాట కూడా. రాష్ట్రానికి ప్రత్యేక హోదా బదులు ప్యాకేజీ చాలు అని చెప్పడానికి చంద్రబాబు ఎవరు? ఆంధ్రరాష్ట్ర ప్రజల హక్కును తాకట్టుపెట్టే అధికారం కేంద్రం, చంద్రబాబుకు ఎవరిచ్చారు? అని జగన్‌ ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ ఏపీ గురించి లోక్‌సభలో అర నిమిషం కూడా మాట్లాడలేదని జగన్‌ తెలిపారు. తిరుపతి ఎన్నికల సభలో ఐదేళ్లు కాదు, ఏపీకి పదేళ్లు హోదా ఇస్తామంటూ హామీ ఇచ్చిన మోడీ తర్వాత మోసం చేశారన్నారు. హోదాపై సంతకం పెట్టేవారికే వచ్చేసారి తమ మద్దతు ఉంటుందని, ఈ విష‌యంలో చంద్ర‌బాబు త‌మ‌తో క‌ల‌సి రావాల‌ని ఆయ‌న సూచించారు. ఈ ప‌రిణామాల‌తో ఏపీ భ‌విష్య‌త్తు మారుతుంద‌ని అన్న జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌ను ప్ర‌జ‌లు పాజిటివ్‌గానే తీసుకుంటున్నారు. మ‌రి బాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
 ఈ నేప‌థ్యంలో ఇప్పుడు చంద్ర‌బాబు పార్ల‌మెంటులో విఫ‌ల‌మైన ప‌రిస్థితిని గుర్తించి జ‌గ‌న్‌.. టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి రావాల‌ని పిలుపు నిచ్చారు. అంద‌రం క‌లిసి కేంద్రంపై పోరాడ‌దామ‌ని పిలుపునిచ్చారు.,వాస్త‌వానికి విప‌క్షంలోనే ఉన్నా.. మంచి మాటే చెప్పార‌ని స‌మైక్యాంద్ర ఉద్య‌మ నాయ‌కులు సైతం చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఎంపీలంతా రాజీనామా చేసి పోరాడితే ప్రత్యేక హోదా ఎందుకు రాదని జ‌గ‌న్ వేసిన ప్ర‌శ్న‌కు ప్ర‌జ‌లు ఓకే చెప్పారు. ఏపీపై కేంద్ర వైఖరికి నిరసనగా, టీడీపీ ఎంపీల రాజీనామాపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ ఈనెల 24న రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. అన్ని పార్టీలు, సంఘా లు, వ్యాపారులు తమ బంద్‌కి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘మీరు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. ఇప్పుడైనా టీడీపీ ఎంపీలందరితో రాజీనామా చేయించి నిరాహారదీక్షలో కూర్చోబెట్టండి. రాజీనామా చేసిన మా ఎంపీలనూ పంపుతాను. దేశమంతా ఇటే చూస్తుంది. హోదా ఎందుకు రాదో చూద్దాం!’ అని జగన్ అన‌డాన్ని రాష్ట్రంలోని మెజారిటీ ప్ర‌జ‌లు స్వాగ‌తిస్తున్నారు.

Related Posts