ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలుపై చర్చించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇచ్చిన నోటీసును రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు స్వీకరించారు. దీనిపై రేపు చర్చ చేపడతామని తెలిపారు. సభ ప్రారంభమైన వెంటనే రాజ్యసభ్య ఛైర్మన్ వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, టీడీపీ, వైసీపీ ఎంపీలు ఇచ్చిన నోటీసులు అందాయని తెలిపారు. అయితే దీనిపై ఈరోజే స్వల్పకాలిక చర్చ చేపట్టాలని తెదేపా సభ్యుడు సుజనాచౌదరి కోరగా ఛైర్మన్‌ను కోరారు. దీనిపై స్పందించిన వెంకయ్యనాయుడు... ఈ నోటీసుపై రేపే చర్చ చేపడతామని పేర్కొన్నారు. రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వంపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ రేపటికి వాయిదా పడింది. రాష్ట్ర విభజన సమస్యలపై స్వల్పకాలిక చర్చకు టీడీపీ, వైసీపీలు నోటీసులు ఇచ్చాయి.సభ్యుల అభ్యర్థన మేరకే చర్చను వాయిదా వేశామని తెలిపారు. మరోవైపు పార్లమెంటు ప్రాంగణం వద్ద టీడీపీ ఎంపీల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.