YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశం లో ఆవులకు ఉన్న రక్షణ మహిళలకు లేదు శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే

దేశం లో ఆవులకు ఉన్న రక్షణ మహిళలకు లేదు                శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే
గోరక్షణ పేరుతో ఆవుల రక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను దేశంలో మహిళల భద్రతకు ఇవ్వడం లేదని శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ఆరోపించారు.  భాజపా వైఖరిపై ఆయన మరోసారి మండిపడ్డారు. తాజాగా భాజపా హిందుత్వ వైఖరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘దేశంలో గత నాలుగైదేళ్లుగా ఉన్న హిందుత్వ విధానాన్ని నేను అంగీకరించను. అది మన హిందుత్వ విధానం కాదు. మన దేశంలో మహిళలు సురక్షితంగా లేరు. కానీ మీరు ఆవులను రక్షిస్తున్నారు. ప్రజలు ఏం తినాలో మీరే నిర్దేశించలేరు’ అని ఠాక్రే తమ అధికార పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.2019 లోక్‌సభ ఎన్నికల్లో శివసేనతో పొత్తుపెట్టుకోబోమని భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌షా నిన్న ప్రకటించిన నేపథ్యంలో ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో తమ పార్టీ భాజపాకు బహిరంగంగానే మద్దతిచ్చిందని.. ఇప్పుడు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నామని అన్నారు. భాజపా ధన బలం, కండ బలం, ఈవీఎంల టాంపరింగ్‌ ద్వారానే ఎన్నికల్లో విజయం సాధిస్తోందని.. దేశంలో నకిలీ ప్రజాస్వామ్యం ఉందని సామ్నాలో ప్రచురించిన సంపాదకీయంలో పేర్కొన్నారు. ఇటీవల మోదీ సర్కార్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌కు శివసేన దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

Related Posts