ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో తీవ్ర అన్యాయం చేసిన భాజపా వచ్చే ఎన్నికల్లో భూస్థాపితం కావటం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. తిరుపతిలోని పద్మావతిపురం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన రాస్తారోకోలో సీపీఎం జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీనివాసరావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. తిరుచానూరు-తిరుపతి రహదారిపై వాహనాలను నిలిపివేసిన వామపక్ష కార్యకర్తలు ప్రత్యేక హోదా కోరుతూ నినాదాలు చేశారు. విభజన చట్టంలోని హామీలను నెరవేరుస్తామంటూ అధికారంలోకి వచ్చిన భాజపా రాష్ట్రాన్ని చులకన చేసి పార్లమెంటులో మాట్లాడటం సమంజసం కాదని రామకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం దిగి వచ్చేంత వరకు వామపక్షాల పోరాటం ఆగదన్నారు. ప్రత్యేక హోదా నినాదంతో బుధవారం వామపక్షాలు, జనసేన, ఆప్, లోక్‌సత్తా పార్టీల యువజన సంఘాల ఆధ్వర్యంలో కోటి మందితో మానవహారాన్ని నిర్వహించనున్నట్లు రామకృష్ణ ప్రకటించారు