రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేస్తోందనిఆ ఒప్పందంపై దేశాన్ని తప్పుదోవ పట్టించిన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేరొన్నది. యుద్ధ విమానాలను ఎంత ధరకు కొన్నారన్న అంశాన్ని బహిర్గతం చేయలేమని రక్షణ మంత్రి సీతారామన్ ఇటీవల సభలో తెలిపారు. ఆ అంశంపై సభా నోటీసులు ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. రాఫెల్ విమానాల ధర విషయంలో ఎటుంటి రహస్య ఒప్పందం లేదని మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తెలిపారు. తన హయాంలో కొనుగోలు చేసిన అనేక యుద్ధ విమానాల ఖర్చును బయటపెట్టినట్లు ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు.గతంలో ఫ్రాన్స్ నుంచి మిరేజ్ యుద్ధ విమానాన్ని కొనుగోలు చేసినట్లు మాజీ మంత్రి ఆంటోనీ తెలిపారు. ప్రతి యుద్ధ విమానానికి సంబంధించిన ధరను కచ్చితంగా వెల్లడించాలని ఆంటోనీ అన్నారు. కాగ్‌తో పాటు ప్యాక్ కూడా రాఫెల్ విమానాల ధరలను పరిశీలిస్తుంది కాబట్ తప్పకుండా ఆ ధరలను వెల్లడించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాఫెల్ ధరలను దాచిన ప్రధాని మోదీతో పాటు రక్షణ మంత్రి సీతారామన్.. పార్లమెంట్‌లో వివరణ ఇవ్వాల్సి ఉంటుందని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ అన్నారు. రాఫెల్ ధరను వెల్లడించేందుకు ఫ్రెంచ్ ప్రభుత్వానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఇదే విషయాన్ని రాహుల్ గాంధీతో ఆ దేశాధ్యక్షుడు తెలియజేశారని ఆనంద్ శర్మ చెప్పారు.