YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హై కోర్టుకు పరిపూర్ణనంద

 హై కోర్టుకు పరిపూర్ణనంద
శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద దాఖలు చేసిన పిటిషన్‌పై  సోమవారం హైకోర్టులోవాదనలు కొనసాగాయి. తనను నగరం నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తూ.. హైదరాబాద్‌ పోలీసులు జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు. ఈ కేసులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను ప్రతివాదిగా చేర్చారు.ఓ టీవీ చానెల్‌లో చర్చ సందర్భంగా శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేష్‌ చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్రకు సంకల్పించిన స్వామి పరిపూర్ణానందపై తెలంగాణ పోలీసులు నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. దాదాపు ఆరు నెలలపాటు బహిష్కరణ విధించినట్లు పోలీసులు తెలిపారు.తనపై విధించిన నగర బహిష్కరణపై న్యాయపోరాటం చేయాలని స్వామి పరిపూర్ణానంద నిర్ణయించారు. ఇందులో భాగంగానే హైకోర్టులో ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. తన బహిష్కరణ రాజ్యాంగ విరుద్ధమని, గూండాలను మాత్రమే నగరం నుంచి పోలీసులు బహిష్కరిస్తారని పరిపూర్ణానంద పిటిషన్‌లో పేర్కొన్నారు.

Related Posts