బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కూతరు శ్వేతా నందాతో కలిసి కేరళకు చెందిన ఒక ప్రముఖ బంగారు ఆభరణాల కంపెనీ ప్రకటనన రూపొందించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనలోనూ వీరిద్దరూ తండ్రీ కూతుళ్లుగా నటించారు. ఆ సంస్థ ఆభరణాలు, నగలపై ఉన్న నమ్మకాన్ని ప్రజలకు తెలియజేయడమే ఆ ప్రకటన ముఖ్య ఉద్దేశం. 1.5 నిమిషాల ప్రకటనపై దేశవ్యాప్తంగా బ్యాంకర్ల నుంచి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకం, చెడు అభిప్రాయం కలిగే ఆ యాడ్ ఉందని పేర్కొంటున్నాయి. కల్యాణ్ జువెల్లర్స్ ఆ ప్రకటనను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించింది. బ్యాంకింగ్ వ్యవస్థతో పాటు కొంతమంది మనోభావాలు దెబ్బతీసేలా ఆ ప్రకటన ఉందని గ్రహించాం. అన్ని మాద్యమాల నుంచి తక్షణమే ఆ ప్రకటనను నిలిపివేస్తున్నామని కల్యాణ్ జువెల్లర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ తెలిపారు. కేవలం అది ప్రచార చిత్రం మాత్రమేనని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. తెలుగు ప్రసార మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న యాడ్‌లో టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున ఈ ప్రకటనలో నటించారు. నమ్మకానికి పెట్టింది పేరు కల్యాణ్ జువెల్లర్స్ అంటూ యాడ్ ముగిసిపోతుంది.