YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బంద్ ను విజయవంతం చేయాలి

బంద్ ను విజయవంతం చేయాలి
 ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎంపీలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లాది విష్ణు, పైలా సోమినాయుడు తీవ్ర విమర్శలు చేశారు.  సోమవారం విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో  మీడియాతో వారు మాట్లాడుతూ చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా ఉద్యమంలో టీడీపీ కూడా భాగస్వామి కావాలని అన్నారు. టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి రాజకీయ సంక్షోభం సృష్టించాలని, ఏపీలో ఉన్న 25మంది ఎంపీలు రాజీనామా చేసి నిరాహార దీక్ష చేస్తే ఖచ్ఛితంగా ప్రత్యేక హోదా వస్తుందని మల్లాది విష్ణు అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జులై 24న తలపెట్టిన రాష్ట్ర బంద్కు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ ఏపీ ప్రజలను మోసం చేశారని అన్నారు.  మోడీ పార్లమెంటు సాక్షిగా హోదా విషయంలో మోసం చేశారని ఆరోపించారు.  చంద్రబాబు ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తుంగలో తొక్కారని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే మొదటి నుంచి చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారని మల్లాది చెప్పారు.  అవిశ్వాసం సందర్భంగా టీడీపీ, బీజేపీ చేసిన ద్రోహానికి నిరసనగా  మంగళవారం బంద్కు జగన్ పిలుపునిచ్చారని, మంగళవారం నాటి బంద్లో ప్రజలు, ఉద్యోగ సంఘాలు బంద్లో పాల్గొనాలని కోరారు. హోదా వస్తే పరిశ్రమలు వస్తాయని, దీంతో యువతకు ఉద్యోగాలు వస్తాయని మల్లాది చెప్పారు.  ప్రత్యేక హోదా కోసం ఎవరు పోరాడినా తాము మద్దతిచ్చామని, అలాగే భవిష్యతలో కూడా మద్దతు ఇస్తామని తెలిపారు.

Related Posts