‘ఇప్పుడిప్పుడే కృష్ణానదిలోకి నీరు వస్తోంది.గోదావరిలో ఇప్పటికే 419టిఎంసీలు సముద్రంలో కలిసింది. వంశధార,నాగావళికి వరద ప్రవాహం పెరిగింది.మరో పదిరోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్ నిండుతుంది. రేపటినుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని రాయలసీమకు విడుదల చేస్తాం.శ్రీశైలం రిజర్వాయర్ కు నీళ్లు చేరిన వెంటనే రాయలసీమకు సాగునీరు ఇవ్వగలగడం గతంలో లేదు.పట్టిసీమ ద్వారా గోదావరి,కృష్ణా నదుల అనుసంధానం వల్లే ఇది సాధ్యం అయ్యింది.గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు మళ్లించి,శ్రీశైలం నుంచి రాయలసీమకు నీళ్లు ఇవ్వగలగడం భగీరథ ప్రయత్నమే.గత 4ఏళ్లలో మన ముందుచూపు, కార్యాచరణ వల్లే ఇది సాధ్యం అయ్యింది.జూన్ లోనే కృష్ణా డెల్టా ఆయకట్టులో పంటలు వేయడం 150ఏళ్ల డెల్టా చరిత్రలో రికార్డు. సకాలంలో నాట్లు పడటమే కాకుండా నవంబర్ లో వచ్చే తుపాన్ల బారినుంచి పంటను కాపాడుకోవడానికి దోహద పడింది.అదేవిధంగా జులై 3వ వారంలోనే శ్రీశైలం నుంచి రాయలసీమ జిల్లాలకు సాగునీటిని ఇవ్వడం మరో రికార్డు.నదుల అనుసంధానం ద్వారా,నీరు-ప్రగతి,జలసంరక్షణ ఉద్యమం వల్ల దీనిని సాధించగలిగాం. గతంలో సాగునీటి విడుదలపై గొడవలు జరిగేవి.గేట్లు ఎత్తాలని కొందరు,ఎత్తకూడదని మరికొందరు గొడవలకు దిగేవారు.అలాంటిది ఇప్పుడు పులివెందులకు కూడా నీళ్లివ్వగలిగాం అంటే అదంతా ప్రభుత్వం ముందు చూపు వల్లే సాధ్యం అయ్యింది.వర్షాభావంలో కూడా చీనీ తోటలు ఎండిపోకుండా చూడగలిగాం.శ్రీశైలంకు నీళ్లు చేరిన వెను వెంటనే సీమకు నీళ్లిచ్చే పరిస్థితి తీసుకువచ్చాం.అటు నదుల అనుసంధానం,ఇటు జల సంరక్షణ చర్యల సత్ఫలితాలను రైతులకు చేరువ చేయగలిగాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.శ్రీశైలం డ్యామ్ కు 2,26,000క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉందని జలాశయ నీటిమట్టం 846.5అడుగులకు చేరిందని,నీటినిల్వ 72.78టిఎంసిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.రాబోయే నాలుగైదు రోజులు ఇదే స్థాయిలో ఇన్ ఫ్లోఉంటుందని,రోజుకు 8-10టిఎంసిలు ఇన్ ఫ్లోగా వస్తున్నట్లు అధికారులు వివరించారు.దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ,‘‘ వచ్చే ప్రతినీటి చుక్కను సద్వినియోగం చేయాలి. భూమినే జలాశయంగా మార్చుకోవాలి.స్మార్ట్ వాటర్ గ్రిడ్ కు వెళ్లాలి,సుస్థిర ఆర్ధికాభివృద్ధి సాధించాలి.రాయలసీమలో వర్షాభావ పరిస్థితి ఉంది.లోటు వర్షపాతం ప్రాంతాలలో రెయిన్ గన్స్ వాడాలి.రెయిన్ గన్,జిబా సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని అన్నారు.సింగనమల,రాప్తాడు మండలాల్లో 149ఎకరాల్లో రెయిన్ గన్స్ వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ,‘‘సకాలంలో మార్కెట్ జోక్యంకు తోతా మామిడి మరో ఉదాహరణ.ఇప్పటివరకు లక్ష టన్నుల మామిడిని సేకరించాం.ప్రభుత్వ స్పందనపై రైతుల్లో పూర్తిస్థాయిలో సంతృప్తి ఉంది.సకాలంలో రైతులను ఆదుకున్నాం.ఇదే స్ఫూర్తితో జ్యూస్ తయారీ కంపెనీలు కూడా సహకరించాలి.మామిడి రైతులను ఆదుకున్న జిల్లా యంత్రాంగానికి అభినందనలు.ఒకవైపు హక్కుల కోసం పోరాటం-మరోవైపు అభివృద్ధి కోసం కృషి‘‘అక్కడ పార్లమెంటులో మన ఎంపీలు పోరాటం చేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కోసం అధికార యంత్రాంగం కృషి చేస్తోంది.ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కూడా కొనసాగించాలి. ఒకవైపు హక్కుల కోసం పోరాటం-మరోవైపు అభివృద్ధి కోసం కృషి జరగాలి.ఉంటుందని,రోజుకు 8-10టిఎంసిలు ఇన్ ఫ్లోగా వస్తున్నట్లు అధికారులు వివరించారు.దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ,‘‘ వచ్చే ప్రతినీటి చుక్కను సద్వినియోగం చేయాలి. భూమినే జలాశయంగా మార్చుకోవాలి.స్మార్ట్ వాటర్ గ్రిడ్ కు వెళ్లాలి,సుస్థిర ఆర్ధికాభివృద్ధి సాధించాలి.రాయలసీమలో వర్షాభావ పరిస్థితి ఉంది.లోటు వర్షపాతం ప్రాంతాలలో రెయిన్ గన్స్ వాడాలి.రెయిన్ గన్,జిబా సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలి’’ అని అన్నారు.సింగనమల,రాప్తాడు మండలాల్లో 149ఎకరాల్లో రెయిన్ గన్స్ వినియోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ,‘‘సకాలంలో మార్కెట్ జోక్యంకు తోతా మామిడి మరో అన్ని శాఖల్లో మన కృషి ఫలిస్తోంది.సుస్థిర ఆర్ధికాభివృద్ధే మన లక్ష్యం కావాలి. నాలుగేళ్లలో వ్యవస్థలను పటిష్టంగా నిర్మించాం.సమర్ధంగా వ్యవస్థలను వినియోగించుకోవాలి. సత్ఫలితాలను సాధించాలి.వనరులు ఉన్నాయి,నిధులు సమీకరిస్తున్నాం.వాటి నిర్వహణలోనే మన సామర్ధ్యం బైటపడుతుంది.నరేగాలో లేబర్ కాంపోనెంట్ లక్ష్యం చేరుకున్నాం.మెటీరియల్ కాంపోనెంట్ లక్ష్యం పూర్తిచేయాలి. పంటకుంటలు,సిమెంట్ రోడ్ల నిర్మాణం ముమ్మరం చేయాలి.పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి.అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2018లో జాతీయ అవార్డులలో అధికం మనమే సాధించాలి.ప్రతి శనివారం స్వచ్ఛదినంగా పాటించాలి. దేశంలోనే ఆరోగ్యరాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలి’’ అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.ఈ టెలికాన్ఫరెన్స్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులు శశిభూషణ్,రాజశేఖర్,జవహర్ రెడ్డి,పూనం మాలకొండయ్య,అహ్మద్ బాబు,ఇస్రో రాజశేఖర్, రామాంజనేయులు,చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఇతర అధికారులు పాల్గొన్నారు.