ఆంధ్రప్రదేశ్ లో బంద్ చేపట్టిన వైసీపీ. రోడ్డుఫై కి వచ్చిన నేతలు కాలేజీ, స్కూలు, వ్యాపార సంస్థలను మూసివేయించారు. ఆర్టీసీ బస్సులు రాకుండా అడ్డుకుంటున్నారు. ఆందోళన నిర్వహిస్తున్న పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒంగోలు వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డిని, విజయవాడలో పార్థసారథి, యలమంచిలి రవిని అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ బస్సు కాంప్లెక్స్ దగ్గర ఆందోళన చేపట్టిన వైసీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.