మంగళవారం ఉదయం టిడిపి ఎంపిలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చట్టాన్ని ఎందుకు అమలు చేయరని కేంద్రాన్ని ప్రశ్నించాలని ఎంపీలకు సూచించారు. చట్టం అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే ఉండకూడదన్నారు. మనం కూడా పన్నులు చెల్లిస్తున్నామన్నారు. మన సంక్షేమం చూడాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. ఏ రాష్ట్రంలోనైనా ప్రజల మనోభావాలు దెబ్బతీయదన్నారు అవిశ్వాసం పెట్టడమే కాదు ఆంధ్రుల సత్తా చూపారు అన్న భావన రావాలి. మన ఎంపిల పోరాటాన్ని ప్రజల్లో ప్రశంసలు రావాలి. మీ నాయకత్వ సామర్ధ్యం చూపడానికి ఇదొక అవకాశం. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. సభలో ఆందోళనలు కొనసాగించాలని అన్నారు. సభ వెలుపల నిరసనలు తెలపాలి.పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాలి. చట్టాన్ని ఎందుకు అమలు చేయరని ప్రశ్నించాలి..? చట్టం అమలు చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తేలేదు. హామీలు నెరవేర్చేవరకు వదిలిపెట్టం. తెలుగు పౌరుషం చూపిస్తాం.సాధించేవరకు వదిలిపెట్టం. మేము కూడా పన్నులు చెల్లిస్తున్నామన్నారు. మా సంక్షేమం చూడాల్సిన బాధ్యత మీదే. అభివృద్ధి అనేది రాజకీయాలకు అతీతంగా జరగాలి. ఏ రాష్ట్రంలోనైనా ప్రజల మనోభావాలను దెబ్బతీయరాదు. ఇన్నాళ్లు అడిగాం,ఇప్పుడు నిలదీస్తున్నాం. నమ్మకద్రోహంపై ధర్మపోరాటం చేస్తున్నాం. ఇది రెండు పార్టీల మధ్య సమస్య కాదు. రెండు ప్రభుత్వాల మధ్య సంబంధం. 5 కోట్ల ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని అన్నారు. ఎక్కడ అవకాశం దొరికినా ఏపికి జరిగిన అన్యాయంపై ధ్వజమెత్తాలి. ఆధిక్యత ఉందని ఇంత లెక్కలేనితనం మంచిదికాదు. ప్రజల మనోభావాలతో ఆడుకోవడం మంచిదికాదని అన్నారు. విభజనకు ముందు,విభజనలో,విభజన తరువాత కూడా ఏపికి అన్యాయమే చేస్తారా..? పొజిషన్స్ మారినంత మాత్రాన పాలసీలు మారతాయా..? ప్రతిపక్షం అధికారంలోకి వచ్చాక హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత లేదా అని అయన ప్రశ్నించారు.