ఘంటసాల మండలం మల్లంపల్లి పంచాయతీ శివారులో ఉన్నటువంటి బోళ్లపాడు గ్రామ దారి లో సుమారు 50 సంవత్సరాల క్రితం నిర్మించిన వంతెన, పైన చూపిన విధంగా గా 2 నెలల క్రితం వంతెన గోడ కూలి, తరువాత రోడ్డు సగానికి కూలిపోయింది. ఆటోలు, మోటారు సైకిళ్ళు తప్ప స్కూల్ బస్సులు కూడా రాకపోవడంతో ఆ గ్రామ ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. కూలిన సమయంలో పోలీసు వారు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవి కూడా లేవు. రాత్రి సమయాలలో లైట్లు లేకపోవడంతో చీకట్లో వచ్చి ఈ గుంటలో పడిపోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రోడ్డు పంచాయతీరాజ్ శాఖ కింద సాంక్షన్ అయ్యింది. కానీ ఈ బ్రిడ్జి డ్రైనేజ్ శాఖవారు ఇంతకుముందు నిర్మించారు. కనుక వారు నుంచి అనుమతి రావాల్సి ఉంది. కనుక డ్రైనేజ్ శాఖ వారితో మాట్లాడి పరిమిషన్ కు లెటర్ పంపించాలి. గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున ఈ సమస్యలకు త్వరగా పరిష్కారం చూపిస్తారని గ్రామస్తులు ఆశిస్తున్నారు.