ఫోటోలో చూపిన దారి బంటుమిల్లి బస్టాండ్ కి వెళ్లే దారి. వర్షం నీటిలో ఎక్కడ గుంటలు ఉన్నాయో తెలియక ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే బస్టాండ్ చుట్టూరు కూడా వర్షం నీటితో నిండిపోయి ఉంటుంది. బస్టాండ్ నుంచి మచిలీపట్నం, గుడివాడ కృత్తివెన్ను వెళ్లే దారులు సుమారుగా ఐదు కిలోమీటర్ల వరకు ఇలా గుంటలు వర్షం నీటితో నిండిపోయి ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలుగ చేస్తున్నాయి. బంటుమిల్లి గ్రామస్థులే కాకుండా ప్రయాణికులు, చుట్టుపక్కల గ్రామాలకు వేళే వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్ల విషయంలో అధికారులు త్వరగా సహాయం చేస్తారని గ్రామస్తులు కోరుకుంటున్నారు.