దివిసీమ అభివృద్ధి ఆకాంక్షించే వారికీ గ్రామస్తులు విన్నపం.
శివారు గ్రామాలలో ప్రతి ఇంటిలో పళ్ళ మరియు కూరగాయ మొక్కలు విరివిగా పెరగాలన్న ఆలోచనతో ఇప్పటికి పది వేల మొక్కలు 80 గ్రామాలలో 3వేల మంది కుటుంబాలకు పంపకం చేయడం జరిగింది. ఇప్పుడు మరొక 15 వేల పళ్ళ మొక్కలు ఒకటి రెండు రోజుల్లో రానున్నాయి. అలాగే 1500 కుటుంబాలకు సరిపడా కూరగాయ విత్తనాలు కూడా పంపకం చేయటం మొదలుపెట్టారు. ఈ విత్తనాలు బెంగుళూరులోనీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ వారి ద్వారా తయారుచేయబడిన బ్రీడర్ విత్తనాలు. అధిక దిగుబడి ఇస్తాయి. రాబోవుకాలంలో మన ప్రాంతంలోని ప్రతి ఇంటిలో పళ్ళు కూరగాయలు తద్వారా గ్రామస్థులందరికీ మంచి ఆరోగ్యం కలగాలని ఆకాంక్షిస్తున్నారు.