YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీటీడీ చైర్మన్ సీటులో పుట్టా సుధాకర్‌ యాదవ్‌...

 టీటీడీ చైర్మన్ సీటులో పుట్టా సుధాకర్‌ యాదవ్‌...

- ఇవాళ లేదా రేపు ఉత్తర్వులు జారీ

టీటీడీ పాలక మండలి పదవీకాలం పూర్తైనప్పట్నుంచి చైర్మన్ సీటులో ఎవర్ని కూర్చోబెట్టాలా అని సుమారు ఏడు నెలలపాటు టీడీపీ పెద్దలు కసరత్తు చేశారు. ఎట్టకేలకు కడప జిల్లా మైదుకూరుకు చెందిన పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పేరును దాదాపు ఖరారు చేసేశారు. టీటీడీ ఛైర్మన్‌గా నియమించాలని మూడు నెలల క్రితమే ప్రభుత్వం నిర్ణయించినా.. పలు కారణాలతో ఆలస్యమైంది. దీంతో ఇవాళ లేదా రేపు ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి. కాగా ఇప్పటికే టీటీడీ పాలకమండలి సభ్యులపై కూడా కసరత్తు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. చైర్మన్‌తో పాటు సభ్యుల పేర్లను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించనున్నారు. కాగా మొదట్నుంచి పుట్టా పేరే వినిపిస్తోంది.. ఆఖరికి ఆయనకే పదవి దక్కినట్లైంది కాగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఆశావహులకు నిరాశ..
అయితే ఇప్పటికే పలువురు ఈ చైర్మన్ పదవికోసం పోటీపడిన విషయం తెలిసిందే. అయితే పుట్టా పేరు ఖరారు కావడంతో వారు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. కాగా మంత్రి పదవి కోసం ఆశించినా రాకపోడంతో కనీసం టీటీడీ చైర్మన్ పదవి అయినా వస్తుందని చాలా మంది ఆశావహులు వేచి చూసినప్పటికీ చంద్రబాబు మాత్రం వారందర్నీ పక్కనపెట్టి పుట్టా పేరు ఖరారు చేసేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్‌.. ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి విన్నవించుకున్న విషయం తెలిసిందే. అప్పట్లో నందమూరి హరికృష్ణ కూడా చైర్మన్ బరిలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.!

పుట్టా రాజకీయ ప్రస్థానం..
పుట్టా సుధాకర్‌యాదవ్‌ కడప జిల్లా మైదుకూరు తెలుగుదేశం నేత. 2014 ఎన్నికల్లో మైదుకూరు నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి చేతిలో ఘోర ఓటమిని చవి చూశారు. ప్రస్తుతం మైదుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఆయన ఓడిపోయినప్పటికీ టీడీపీ పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్న సుధాకర్‌యాదవ్‌ పేరును టీటీడీ చైర్మన్ పదవికి ఖరారు చేశారు.?

Related Posts