YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

శుక్రవారం వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణ విషయాలు

శుక్రవారం వచ్చే సంపూర్ణ  చంద్రగ్రహణ విషయాలు

గ్రహణం రోజు అనగా 27-07-2018 శుక్రవారం నాడు మధ్యాహ్నం 4 గంటల వరకు సామాన్య మానవులు అందరూ అన్నపానాదులు ముగించాలి. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం రాత్రి 9 గంటల వరకు తినవచ్చు. అది కూడా అల్పాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ గ్రహణం మకర రాశి వారు అయిన ఉత్తరాషాడ, శ్రవణ, దనిష్ఠ నక్షత్ర జాతకుల వారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ గ్రహణం చూడరాదు.

గ్రహణ పట్టు ,మధ్య , విడుపుస్నానాలు ఆచరించే వారు యాధావిధిగా స్నానం ఆచరించి,మంత్రానుష్టానములను నిర్వహించుకొవచ్చును.

గ్రహణం సమయంలో ఎవరి నక్షత్ర జపం వారు చేసుకోవచ్చును. లేదా మీకు ఏదైనా మంత్రానుష్టానం ఉంటే ఆ మంత్రం జపం చేసుకోవచ్చు. లేదా చంద్ర గాయత్రి మంత్రం జపం చేసుకోవచ్చు.

చంద్ర గాయత్రి - ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి, తన్నోశ్చంద్రః ప్రచోదయాత్.

గ్రహణం మరసటి రోజు అనగా శనివారం నాడు ఇల్లు శుభ్రంగా కడుగుకుని, స్నానం చేసే నీళ్ళలో చిటికెడు పసుపు,రెండు హారతి కర్పూరం బిల్లలను చూర్ణం చేసుకుని నీళ్ళలో వేసుకుని తప్పక అందరూ తల స్నానం చేసుకోవాలి.ఆ తర్వాత ఇంట్లో ఉన్న పూజగదిని శుభ్రపరచుకుని గాయత్రి ( జంధ్యం) ని మార్చుకుని, దేవత విగ్రహాలను,యంత్రాలను "పులికాపి" చేయాలి. శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు, యంత్రాలు ప్రోక్షణ చేసి దీపారాధన అలంకరణం చేసి మహా నైవేద్యం కొరకు బెల్లంతో చేసిన పరమాన్నం వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనస్సును ప్రశాంతగా ఉంచుకుని మూడు ప్రదక్షిణలు నిధానంగా చేసి మనస్సులో సమస్త గ్రహాదోష నివారణ కలిగించమని సాష్టాంగా నమస్కారం చేస్తూ విన్నవించుకోవాలి, ఆడవారు సాష్టాంగ నమస్కారం ఎప్పుడు, ఎక్కడ చేయకూడదు.ఆడవారు కేవలం మోకాళ్ల పైనే చేయాలి. ముఖ్యంగా గర్భిణిలు నిలబడే నమస్కరించుకోవాలి,

ముఖ్యంగా గర్భవతులు ఎలాంటి భయందోళన పడవలసిన అవసరం లేదు. గర్భవతులు ఎవరైన రాత్రి గ్రహణ సమయానికి మేలుకుని ఉంటే ప్రత్యక్షంగా చూడ కూడదు, మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు మరీ మంచిది. గ్రహణ సమయంలో కదలకూడదు, మల, మూత్ర విసర్జన చేయకూడదు. గ్రహణం ప్రారంభానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఎవరినైనా పెద్దవారిని పక్కన కూర్చోబెట్టుకుని వారి ద్వారా సపర్యలు పొందాలి.

ఇంట్లో పూజ అయిన తర్వాత గుడికి, దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల వచ్చును. మకరరాశి వారు పండితులను సంప్రదించి దోష పరిహార జప, దానాదులను చేసుకోవాలి. ద్వాదశ రాశుల వారు గోమాతకు బియ్యం, తోటకూర, బెల్లం కలిపి ఆవునకు తినిపించాలి. గోమాత మనం పెట్టిన ధాన్యం తినేప్పుడు మూడు ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయి. నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను గుమ్మంపై నుండి తీసివేసి మళ్లి కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే పూజించి ఇంటికి, వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి. గ్రహణం తర్వత మనం ఇంటి రక్షణ కోసం కట్టిన గుమ్మడి,కొబ్బరి కాయలు శక్తి కోల్పోతాయి. కాబట్టి తిరిగి మనకు, మన కుంటుబ సభ్యుల కొరకు, ఇంటికి, వ్యాపార సంస్థల రక్షణ కొరకు తప్పక కట్టుకోవాలి.

Related Posts