ఏప్రిల్ నెలలో ఏరియా హాస్పిటల్, అవనిగడ్డ లోని సమస్యల గురించి పూనమ్ మాలకొండయ్య గారి దృష్టికి ప్రజలు తీసుకు వెళ్లడం జరిగింది. వారి ఆదేశాలతో డాక్టర్ నాగలక్ష్మి గారు గైనకాలజిస్ట్ అవనిగడ్డలో ఏరియా హాస్పిటల్ లో చేరారు. అలాగే అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో ఒక సర్జన్ మరియు పిల్లల డాక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ రెండిటిని కూడా భర్తీ చేయాలనీ ప్రజలు కోరుకుంటున్నారు.
ఏరియా ఆస్పత్రిలో డెంటిస్ట్ మరియు ఆర్తో డాక్టర్ గార్లు ఉన్నారు. వారికి ఆర్దో టేబుల్ మరియు డెంటల్ చైర్ సమకూర్చి నట్లయితే అవనిగడ్డ ప్రాంతం నుండి పేదవారు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు మచిలీపట్నం కానీ విజయవాడ కానీ వెళ్ళనవసరం ఉండదు. కనుక పైన కోరిన విధం గా రెండు పోస్టులు మరియు రెండు సదుపాయాలు కలుగ చేయగలరని ప్రజలు విన్నపం.