బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ ఎంపిలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు,రాష్ట్ర మంత్రులు,పార్టీ బాధ్యులు పాల్గోన్నారు. ఏపికి జరిగిన అన్యాయంపై నిన్న రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీశారు. రాజ్యసభలో మన ఎంపిలు బాగా పోరాడారు. బిజెపి మినహా అన్ని పార్టీలు ఏపికి మద్దతుగా నిలిచాయమని అయన అభినందించారు. ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది.అన్యాయాన్ని సరిదిద్దుతారనే విశ్వాసం వచ్చింది. అనేక పార్టీల సహకారం కూడగట్టాం. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని అయన సూచించారు. ప్రత్యేక హోదాపై తానెప్పుడూ రాజీపడలేదు.అప్పుడే పుట్టిన బిడ్డకు అనేక సమస్యలు ఉంటాయి. కొత్త రాష్ట్రం కాబట్టి ఇబ్బందులు అధిగమించేందుకే ప్రాధాన్యం ఇచ్చాను. ఆర్ధికంగా నిలబడేందుకు కృషి చేశాను. పొరుగు రాష్ట్రాలతో సమానస్థాయి వచ్చేదాకా చేయూత ఇవ్వాలన్నాం. నా ఆరాటాన్ని వక్రీకరించేలా మాట్లాడటం సరైందికాదు. అడ్డంగా మాట్లాడటం సరైందికాదని అన్నారు. రాజ్యసభలో చర్చ ద్వారా దేశాన్ని మనం మెప్పించగలిగాం.అనేక పార్టీలను ఒప్పించగలిగాం. ఏపికి మద్దతుగా నిలబడ్డ పార్టీలకు ధన్యవాదాలు. లేఖల ద్వారా ఆయా పార్టీల నేతలకు ధన్యవాదాలు తెలియజేస్తాం. పార్లమెంటులో టిడిపి పోరాటం ఇకపై కూడా కొనసాగిస్తాం.ఇదే సహకారాన్ని ఆయా పార్టీలనుంచి ఇకపై కూడా పొందాలి. వినూత్నంగా టిడిపి ఆందోళనలు ఉండాలి. అన్ని అవకాశాలను వినియోగించుకోవాలి. పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాలని చంద్రబాబు అన్నారు. ఏపికి జరిగిన అన్యాయంపై అన్ని వేదికలపై ధ్వజమెత్తాలి. లోక్ సభలో జయదేవ్,రామ్మోహన్ నాయుడు,కేశినేని ప్రసంగాలకు మంచి స్పందన వచ్చింది.రాజ్యసభలో వైఎస్ చౌదరి,సిఎం రమేష్ ప్రసంగాలకు స్పందన బాగుందని అన్నారు. గాంధీ విగ్రహం వద్ద నిరసనలు కొనసాగించాలి.కళారూపాల ద్వారా నిరసనలు తెలపాలి.ఆయా సమస్యలపై మంత్రిత్వ శాఖల వద్ద ఆందోళనలు చేయాలి. అన్యాయాన్ని టిడిపి సహించదు అనేది ప్రజల్లోకి వెళ్లింది. ఆ నమ్మకాన్ని ఇకపై కూడా నిలబెట్టుకోవాలని అన్నారు. రాజధాని నిర్మాణం,కడప ఉక్కు,విశాఖ రైల్వేజోన్ అంశాలపై పోరాడాలి. ఆయా మంత్రిత్వ శాఖల కార్యాలయాల వద్ద ఆందోళనలు జరపాలి. కాంగ్రెస్ నేతల ప్రసంగాలు వారిపై ప్రజల్లో ద్వేషాన్ని తగ్గించాయి.బిజెపి నేతల ప్రసంగాలు వారి అహాన్ని ప్రదర్శించాయి. ఏ పార్టీకైనా ప్రజల్లో నమ్మకమే ముఖ్యం.ఏ నాయకుడికైనా ప్రజల్లో విశ్వసనీయతే ముఖ్యం. 90% హామీలు నెరవేర్చామని బిజెపి నేతలు పచ్చి అబద్దాలు చెప్పారు.ఆర్ధిక సంఘం హోదా ఇవ్వవద్దని చెప్పిందనన్నారు.వీటిపై ప్రివిలేజ్ మోషన్స్ ఇచ్చే అంశం పరిశీలించాలి.దీనిపై మిగిలిన పార్టీల మద్దతు కూడా పొందాలని అయన అన్నారు.