YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అంగన్ వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా నిలవడానికి వీల్లేదు మంత్రి పరిటాల సునీత

అంగన్ వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా నిలవడానికి వీల్లేదు                మంత్రి పరిటాల సునీత
అంగన్ వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా నిలవడానికి వీల్లేదని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం, సెర్ప్ శాఖ మంత్రి శ్రీమతి పరిటాల సునీత పేర్కొన్నారు. ఈ విషయమై సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో ఎగ్ సప్లయర్స్ తో స్త్రీ శిశు సంక్షేమ శాఖ స్పెషల్ కమీషర్, మంత్రి సమావేశమై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో అన్న అమృతహస్తం, బాలామృతం పధకాల ద్వారా గర్భిణీ, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని తెలిపారు. జులై నెలకు ఇవ్వవలసిన కోడిగుడ్లు అంగన్ వాడీ సెంటర్లకు చేరకపోవడానికి గల కారణాలు సప్లయ్ దారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. జులై 2017 నుండి కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారని జులై 15, 2018 తో గడువు పూర్తయిందని సప్లయ్ దరులు మంత్రికి తెలిపారు. కోడిగుడ్లు సరఫరాను మరో మూడు నెలలు పొడిగిస్తూ ఇటీవలే ఉత్తర్వులు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలిపారు.  గడిచిన ఐదు నెలలుగా సరఫరా చేసిన కోడిగుడ్లు కు బిల్లులు ఇంకా చెల్లించకపోవడంతో కొనుగోలు శక్తి లేక సరఫరా చేయలేకపోయామని సప్లయ్ దారులు మంత్రికి వివరించారు. అంతేకాకుండా లారీల బంద్ తో కొన్ని జిల్లాలలో సరఫరా జరగలేదని వారు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నెలాఖరులోపు బకాయిలు ఉన్న మొత్తాన్ని చెల్లిస్తామన్నారు. చిన్న చిన్న కారణాల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఇకపై అటువంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని మంత్రి అన్నారు. అంగన్ వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు ముద్ర లేకపోవడం, సైజు చిన్నగా ఉండడం, పాడయిపోయిన గుడ్లు రావడం లాంటివి ఇకపై జరగకుండా చూసుకోవాలని సప్లై దారులను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం నిర్ధేశించిన ప్రకారం కోడిగుడ్లు సైజు, స్టాంపు తప్పని సరిగా ఉండేలా చూడాలన్నారు. స్టాంప్ లేకుండా వచ్చిన గుడ్లుకు బిల్లు చెల్లించడం జరగదని దీనిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కోడిగుడ్లు సరఫరాలో అవకతవకలకు తావులేకుండా చూసేందుకు మొబైల్ యప్ తయారు చేయడం జరిగిందని, అంగన్ వాడీ సెంటర్ లో గుడ్లు తీసుకున్న వెంటనే అంగన్ వాడీ వర్కర్ బయోమెట్రిక్ వేసి తీసుకోవడం జరుగుతుందన్నారు. నిర్ణీత సమయానికి అంగన్ వాడీ సెంటర్లకు కోడిగుడ్లు సరఫరా జరిగేలా చూడాలన్నారు. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న చిన్న చిన్న తప్పులకు ఆనెలంతా బిల్లులు నిలిపివేస్తున్నారని దీనివల్ల సఫ్లై దారులు ఆర్ధిక సమస్యలు ఎదుర్కొంటున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇటువంటి వాటిని విచారించి అవసరమయితే వాటి వరకు బిల్లులు ఆపి విచారణ చేసిన అనంతరం చెల్లించాలన్నారు. టెండర్ ప్రాసెస్ మూడు నెలలు కాకుండా ఒక నెలలో పూర్తయ్యేలా చూడాలని సఫై దారులు మంత్రిని కోరారు. తెలంగాణా ఫుడ్స్ నుండి ప్రభుత్వం తీసుకుంటున్న బాలామృతం అగ్రిమెంట్ గడువు ముగుస్తున్నందున, కోడిగుడ్లు లా సప్లై నిలిచిపోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి కమీషనర్ కు సూచించారు. 

Related Posts