YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సభా హక్కుల ఉల్లంఘనకు టీడీపీ ప్లాన్

సభా హక్కుల ఉల్లంఘనకు టీడీపీ ప్లాన్
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనపై రాజీ పడే ప్రసక్తే లేదని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంపై మరో అస్త్రాన్ని సంధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిన నేపథ్యంలో.. టీడీపీ నేతలు సభా హక్కుల ఉల్లంఘన తీర్మాన నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ఎంపీలతో మాట్లాడినట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి ప్రత్యేక హోదా అంశం గురించి సభలో అవాస్తవాలతో సభను తప్పుతోవ పట్టించారనే కారణంతో ఈ తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మోడీపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం కోసం నోటీసులు ఇచ్చింది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లు సభను తప్పుదారి పట్టించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ మంగళవారం లోక్‌సభలో సభాహక్కుల ఉల్లంఘన తీర్మానానికి నోటీసులు ఇచ్చింది. రాఫెల్ ఒప్పందంలో కోట్లాది రూపాయలు స్కామ్ జరిగిందంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై స్పందించిన రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఈ ఒప్పందాన్ని బహిరంగ పరచకూడదనే నిబంధన ఉందని చెప్పారు. అయితే, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇందులో ఎలాంటి రహస్యం లేదని తనతో చెప్పారని రాహుల్ వాదించారు. ఈ విషయంలో నిర్మలా సీతారామన్, ప్రధాని నరేంద్ర మోడీలు సభను తప్పుతోవ పట్టించారని ఆరోపిస్తూ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు ఫిర్యాదు చేశారు. 

Related Posts