YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఇమ్రాన్ తో ఇబ్బందే

 ఇమ్రాన్ తో ఇబ్బందే

అందరూ చూస్తుండగానే ఓ అంతర్జాతీయ ఉగ్రవాది ఓటేశాడు. బుధవారం పాకిస్తాన్‌ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా లాహోర్‌లోని ఓ ఓటింగ్‌ కేంద్రానికి వెళ్లిన  26/11 ముంబై దాడుల సూత్రధారి, లష్కర్‌-ఈ-తోయిబా(ఎల్‌ఈటీ), జైష్‌-ఈ-మొహమ్మద్ ఉగ్ర సంస్థల చీఫ్‌‌ హఫీజ్‌ సయీద్‌ ఓటు వేశాడు. ముంబై ఉగ్రదాడి వెనుక హఫీజ్‌ సయీద్‌ ఉన్నాడని నిర్ధారించిన అమెరికా 2012 అతన్ని పట్టించిన వారికి 10 మిలియన్‌ డాలర్ల అవార్డును ప్రకటించారు.ఈ ఎన్నికల్లో సయీద్‌ ఓటు వేసేందుకే పరిమితం కాలేదు. అతనికి చెందిన 200 మంది అభ్యర్థులు ఎన్నికల్లో తలపడుతున్నారు. గతేడాది ఆగష్టులో సయీద్‌ మిల్లీ ముస్లిం లీగ్‌(ఎమ్‌ఎమ్‌ఎల్‌) పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించడానికి ప్రయత్నించాడు. అయితే, అమెరికాతో పాటు పలు దేశాలు దీన్ని ముక్తకంఠంతో ఖండించాయి. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్‌ అతని పార్టీకి గుర్తింపు ఇవ్వలేమని పేర్కొంది. అయినా ఎలాంటి ఒత్తడికి గురవని సయీద్‌ అతి సునాయాసంగా తన అభ్యర్థులను అల్లా-ఓ-అక్బర్‌ తెహ్రీక్‌(ఏఏటీ) ద్వారా బరిలో నిలిపాడు.తాలిబన్‌ ఖాన్, ముల్లా ఖాన్‌గా ముద్ర పడిన ‘తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌’  పార్టీ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ బుధవారం పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో విజయం సాధించినట్లయితే అది అటు పాకిస్థాన్‌కు, ఇటు భారత్‌కు అంత మంచిది కాదని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇమ్రాన్‌ ఖాన్‌కు పలు టెర్రరిస్టు సంస్థల నాయకులతో అవినాభావ సంబంధం ఉండడం వల్ల టెర్రరిస్టులు భారత్‌కు వ్యతిరేకంగా మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. కశ్మీర్‌ మరింత కల్లోలం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే పాకిస్థాన్‌ సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్, సైన్యం, ఐఎస్‌ఐ మద్దతుగల ఇమ్రాన్‌ ఖాన్‌ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఎన్నికల సర్వేలు తెలియజేస్తున్నాయి. ఎన్నికల సందర్భంగా చట్టాన్ని ఉల్లంఘించిన వారిని ఎక్కడికక్కడ విచారించి శిక్షలు విధించే జుడీషియల్‌ అధికారాలను పాక్‌ సైన్యానికి కట్టబెడుతూ పాక్‌ సుప్రీం కోర్టు ఇటీవల అసాధారణ ఉత్తర్వులు జారీ చేయడం రెండు వ్యవస్థల మధ్య నెలకొన్న బంధాన్ని తెలియజేస్తోంది. ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయాన్ని గుప్పిట్లో పెట్టుకున్న పాక్‌ సైన్యం, ఐఎస్‌ఐ మున్ముందు ఇమ్రాన్‌ ఖాన్‌ ను పూర్తిగా తమ గుప్పిట్లోకి తీసుకొని వ్యవహరించే ప్రమాదం ఉంది. మరోవైపు ఐక్యరాజ్య సమితి నిషేధించిన హర్కత్‌ ఉల్‌ జిహాద్‌ నాయకుడు మౌలానా ఫజ్లూర్‌ రెహమాన్‌ ఖలీల్‌తోపాటు, లష్కరే తోయిబా మద్దతుగల మిల్లీ ముస్లిం లీగ్, అహ్లే సున్నావాల్‌ జమాత్, బరేల్వి సున్నీ ఇస్లామిస్ట్‌ గ్రూప్, తెహ్రీక్‌ లబ్బాయిక్‌ యా రసూల్‌ అల్లా లాంటి తీవ్రవాద సంస్థల నాయకుల మద్దతు ఇమ్రాన్‌ ఖాన్‌కు ఉందని ‘భారత రీసర్జ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా)’ మాజీ చీఫ్‌ విక్రమ్‌ సూద్‌ ఇటీవలనే తాను ప్రచురించిన ‘ది అన్‌ఎండింగ్‌ గేమ్‌: ఏ ఫార్మర్‌ ఆర్‌ అండ్‌ ఏడబ్లూ చీఫ్సీ ఇన్‌సైట్‌ ఇన్‌టూ ఎస్పియోనేజ్‌’ పుస్తకంలో వెల్లడించారు. పాకిస్థాన్‌ ప్రధానిగా ఇమ్రాన్‌ ఖాన్‌ను ఎన్నుకుంటే పక్కలో బల్లెంలా కాకుండా తుపాకీలా ఉంటాడని ప్రముఖ జర్నలిస్ట్, రచయిత మిన్‌హాజ్‌ మర్చంట్‌ లాంటి వాళ్లు అభివర్ణిస్తున్నారు.

Related Posts