YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విభజన కోసం ఆందోళనలు

విభజన కోసం ఆందోళనలు
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్న కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటనపై టీడీపీ ఎంపీలు భగ్గుమన్నారు. హోదా ఇవ్వద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పిందనడానికి ఆధారాలు చూపాలని టీడీపీ ఎంపీ తోట నర్సింహం డిమాండ్ చేశారు. చట్ట సభలో నాటి ప్రధాని ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయరని ఆయన ప్రశ్నించారు. బుధవారం లోక్‌సభలో  కేంద్రప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయాన్ని టీడీపీ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభలో వినిపించారని అన్నారుఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వివిధ వేషధారణలో నిరసన తెలిపే టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఈరోజు కూడా అదే రీతిలో నిరసనకు దిగారు. ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి వేషధారణలో ఎంపీ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. ‘సై..రా నర్సింహారెడ్డి....నీ పేరే బంగారుకడ్డీ.. నీవేమో పదునైన కత్తి’ అంటూ పాట పాడతూ నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు పార్లమెంటు గాంధీ విగ్రహం ఎదుట టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని ఎంపీలు నిరసన తెలిపారు.వారణాసి నుంచి ఎంపీగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను గంగలో కలిపేశారని టీడీపీ లోక్‌సభ సభ్యుడు తోట నరసింహం ఎద్దేవా చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్‌సభలో జీరో అవర్‌లో మాట్లాడిన తోట.. ఏపీకి జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీని నిలదీశారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు చేసిన చట్టాన్ని ఇప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని గుర్తుచేశారు. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రత్యేక హోదా అంశాన్ని నరేంద్ర మోదీ అనుచరులతో మాట్లాడిన తరవాతే పార్లమెంట్‌లో ప్రస్తావించానని నిన్న రాజ్యసభలో మన్మోహన్ సింగ్ చెప్పారు. కానీ దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏవిధంగానూ స్పందించడంలేదు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఈరోజు లోక్‌సభ, రాజ్యసభల్లో చట్టాలను రూపొందించుకుంటున్నాం. ఆ చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత చట్ట సభల్లో ఉన్న మనమీద ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ పని చేయకుండా ఆంధ్రప్రదేశ్ పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమస్యలను ఎక్కడా ప్రస్తావించడంలేదని తోట గట్టిగానే మాట్లాడారు. అవిశ్వాసం పెట్టినప్పుడు నరేంద్ర మోదీ చాలా మాటలు మాట్లాడారని... సుమారు గంటన్నర పాటు ఉపన్యాసం ఇచ్చారు. అది రాజకీయ ఉపన్యాసం తప్ప ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేసే ప్రసంగం కాదన్నారు. నిన్న కూడా రాజ్యసభలో ఇలాంటి సమాధానాలే చెప్పారన్నారు. కేంద్రం 14వ ఆర్థిక సంఘం పేరుతో కుంటి సాకులు చెబుతున్నారు’ అని కేంద్ర తీరును తోట ఎండగట్టారు.  

Related Posts