YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

సివిల్స్‌ ముఖాముఖికి 100 మంది తెలుగు అభ్యర్థులు- గోపాల కృష్ణ

సివిల్స్‌ ముఖాముఖికి 100 మంది తెలుగు అభ్యర్థులు- గోపాల కృష్ణ

తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువ..

ఆ ప్రభావం తుది ఫలితాల్లోనూ కనిపిస్తుంది

అత్యున్నత కేంద్ర సర్వీసులుగా పేర్కొనే సివిల్స్‌ ప్రధాన (మెయిన్స్‌) పరీక్షా ఫలితాలను యూపీఎస్‌సీ బుధవారం విడుదల చేసింది. గతేడాది అక్టోబరు 28, నవంబరు మూడు తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించిన విషయం గమనార్హం. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల రోల్‌నంబర్లను www.upsc.gov.in లో చూసుకోవచ్చు. ఈ  పరీక్షలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 100 మంది వరకు ఉత్తీర్ణులయినట్లు అంచనా. వీరు  మార్చి నుంచి జరిగే ముఖాముఖిలకు హాజరుకానున్నారు. సుమారు వెయ్యి ఉద్యోగాలకు  2,565 మంది ముఖాముఖి(వ్యక్తిత్వ పరీక్షగా పిలుస్తారు)కి ఎంపికయ్యారు. ప్రాథమిక పరీక్షకు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది దరఖాస్తు చేసినప్పటికీ వారిలో సుమారు 6లక్షల మంది పరీక్ష రాశారు. వారిలో 13,366 మంది మెయిన్స్‌ పరీక్షకు ఎంపికయ్యారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే... హైదరాబాద్‌, విజయవాడ నగరాల్లో జరిగిన ఈ పరీక్షకు ఏపీ, తెలంగాణల నుంచి దాదాపు 900 మంది పరీక్ష రాశారు.  అర్హతసాధించిన వారికి ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయి. అర్హత సాధించిన వారు ఈనెల 18వ తేదీ నుంచి వెబ్‌సైట్‌ ద్వారా ముఖాముఖి లేఖను పొందవచ్చని యూపీఎస్‌సీ తెలిపింది. దక్షిణాదిరాష్ట్రాల విషయానికివస్తే...ఈసారి మెయిన్స్‌ రాసినవారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే ఎక్కువనీ...ఆ ప్రభావం తుది ఫలితాల్లోనూ కనిపిస్తుందని బ్రెయిన్‌ ట్రీ శిక్షణ సంస్థ సంచాలకుడు గోపాల కృష్ణ అభిప్రాయపడ్డారు. 

Related Posts