YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

జగన్ కుటుంబ సభ్యులను ఈ వివాదంలోకి లాగొద్దు - పవన్

 జగన్ కుటుంబ సభ్యులను ఈ వివాదంలోకి లాగొద్దు - పవన్

 వైసీపీ అధినేత జగన్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు సోషల్ మీడియాలో జగన్ ఫై మండిపడుతున్నారు. ఈ మేరకు తన ట్విట్టర్  స్పందించారు. ఈ వివాదంలోకి జగన్ మోహన్ రెడ్డి ఇంటి ఆడపడుచులను, కుటుంబ సభ్యులను లాగవద్దని విన్నవించారు. "ఈ మధ్యన జగన్ మోహన్ రెడ్డి నన్ను వ్యక్తిగతంగా విమర్శించిన తీరు చాలా మందికి బాధ కలిగించిందని నా దృష్టికి వచ్చింది. నేను ఎవరి వ్యక్తిగతమైన జీవితాల్లోకి వెళ్లను. అది రాజకీయ లబ్ది కోసం అసలు వాడను. ప్రజలకు సంబంధించిన పబ్లిక్ పాలసీల మీదే మిగతా పార్టీలతో విభేదిస్తాను కానీ, నాకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవు.

ఈ తరుణంలో ఎవరన్నా జగన్ మోహన్ రెడ్డిని కానీ, వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను కానీ, వారి ఇంటి ఆడపడుచులను కానీ ఈ వివాదంలోకి లాగవద్దని మనస్ఫూర్తిగా అందరినీ వేడుకుంటున్నాను. ఈ వివాదాన్ని దయచేసి అందరూ ఇక్కడితో ఆపివేయాల్సిందిగా నా ప్రార్థన" అని ట్వీట్లో పేర్కొన్నారు.

 

Related Posts