నడకుదురు చల్లపల్లి దగ్గర ఐదు కిలోమీటర్ల రోడ్డు ఉంది. ఈ మధ్యకాలంలో కరకట్ట ఎక్సప్రెస్ బస్సులు, లారీలు ట్రాక్టర్లు ఇలా అనేక వాహనాలు ఈ రోడ్డు మీదుగా వెళ్ళటంతో రోడ్డు పూర్తిగా పాడైపోయింది. రోడ్డు పక్క లు గుంటలు పడిపోయినాయి. ట్రాఫిక్ జామ్‌లు ఎక్కువవుతున్నాయి. ఒక కిలోమీటరు రోడ్డు వెడల్పు చేశారు. మిగిలిన నాలుగు కిలోమీటర్లు రోడ్డు వెడల్పు చేయాల్సి ఉంటుంది. రైతులు,వాహనదారులు,గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికితోడు ఇంతకుముందు తొలగించిన ఆక్రమణలు మరల చిన్నచిన్న ఇల్లు షెడ్లు నిర్మాణం మొదలు పెడుతున్నారు. ఆలస్యమయ్యే కొద్దీ రోడ్డు వెడల్పు సమస్య జటిలమవుతుంది ఈ విషయమై అధికారులు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారీ తో మాట్లాడి, త్వరగా ఫైలు పంపుతారని గ్రామస్థులు ఆశిస్తున్నారు.