సినిమా కథని అంచనా వేసి హిట్ మూవీస్ తీయడం దిల్ రాజు కి ఉన్న క్యాపబులిటీగానే చెప్పుకోవాలి. ఈ ఏడాది ఆయన వరసగా భారీ విజయాలు అందుకున్నాడు. అయితే లవర్ మాత్రం ఆయన స్పీడ్ కి బ్రేక్ వేసింది. దాంతో ఆయన నెక్ట్స్ మూవీపై ఈ ఎపెక్ట్ పడకుండా జాగర్తలు తీసుకుంటున్నాడు. ఆ విశేషాలేంటో మీరే చూడండి.ఇప్పుడు సినిమా తీయటం కంటే దాన్ని పోటీ లేకుండా విడుదల చేసి జనంలోకి తీసుకెళ్లడమే మొయిన్ టాస్క్ గా మారింది. మన సినిమా మీద ఎంత నమ్మకం ఉన్నా..కాంపిటేషన్ లో ఉన్న మూవీకి కూడా హైప్ ఉంటే చాలు అది వసూళ్ల పై ప్రభావం చూపించేస్తోంది. కాంపిటేషన్ లేనప్పుడు రిలీజ్ చేస్తే సినిమా యావరేజ్ గా ఉంటే నష్టాలు రాకుండా మేనేజ్ చేయెచ్చు. ఈ మధ్య దిల్ రాజు రిలీజ్ చేసిన లవర్ తో పాటు మరో మూడు సినిమాలు చిన్న సినిమాలు కూడా రిలీజవ్వడంతో..సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్న భారీ నష్టాలను తీసుకొచ్చింది.మళ్లీ ఇటువంటి మిస్టేక్స్ రిపీటవ్వకుండా దిల్ రాజు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆగస్ట్ 9వ తేదీని రెండు నెలల ముందే లాక్ చేసుకుని తన శ్రీనివాస కళ్యాణంని రెడీ చేసి పెట్టుకున్నారు. ఆ టైమ్ కి సినిమాలు ఏమి రాకుండా దిల్ రాజు జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అయితే శ్రీనివాస కళ్యాణంకి ఒక్క రోజు తేడాతో ఆగస్ట్ 10న అనూహ్యంగా కమల్ హాసన్ విశ్వరూపం 2 నుంచి పోటీ ఎదురుకావడం ఊహించని పరిణామం ఎదురైంది. అయితే రెండు విభిన్న జానర్స్ అవ్వడంతో పెద్ద ప్రాబ్లమ్ లేదనే చెప్పుకోవాలి. క్లన్ ఫామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న శ్రీనివాస కళ్యాణం మీద ఫ్యామిలీ ఆడియన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు. అన్ని సానూకూలతలు ఉన్నాకూడా సోలోగా వస్తే ఎక్కువ ప్రేక్షకులకు రీచ్ అవుతుంది అనే ఉద్దేశంతో పోటీ లేకుండా దిల్ రాజు జాగ్రత్త పడుతున్నాడు. విశ్వరూపం ఉన్నా కూడా అది పెద్ద ఎపెక్ట్ చూపించే అవకాశాలు కనిపించడం లేదు. మరి లవర్ తో దిల్ రాజుకు వచ్చిన నష్టాలను శ్రీనివాస కళ్యానం అయినా తీరుస్తుందేమో లేదో చూడాలి.