YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కాంగ్రెస్ నేతలకు కునుకు లేకుండా చేస్తున్న కుమార

 కాంగ్రెస్ నేతలకు కునుకు లేకుండా చేస్తున్న కుమార
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మరో మెలిక పెట్టారు. కాంగ్రెస్ అనుసరించే విధానాన్ని బట్టే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పొత్తు ఉంటుందని స్పష్టం చేశారు. కుమారస్వామి క్లారిటీతో ఉన్నట్లు కన్పిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం ఎంతో కాలం మనుగడ సాగించలేదని ఆయనకు తెలుసు. ఇదే విషయాన్ని పార్టీ నేతల సమావేశాల్లోనూ వెల్లడించారు. సంకీర్ణ ప్రభుత్వం కావడంతో తానేమీ కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని ఆవేదన చెందారు. ప్రజలు తనను ఎందుకు ఆదరించలేదోనని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా కుమారస్వామి చాలా తెలివిగా కాంగ్రెస్ పార్టీ ముప్పు నుంచి కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముఖ్యమంత్రిగా ఎన్నికైన మరుసటి రోజు నుంచే ప్రారంభించారు.ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు కూడా కుమారస్వామిని నిద్ర పోనివ్వడం లేదు. రుణమాఫీ నుంచి బడ్జెట్ సమావేశాల వరకూ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక కిరికిరి పెడుతూనే ఉంది. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తనకు షాకిస్తుందని గ్రహించిన కుమారస్వామి ముందుగానే గ్రహించి రాష్ట్ర నేతలకు ఝలక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల సీడబ్ల్యూసీ సమావేశానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాహుల్ గాంధీకి కుమారస్వామిపై ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కుమారస్వామి ఏకపక్ష పోకడలను అవలంబిస్తున్నారని, తమ పార్టీకి చెందిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, కట్టడి చేయాలని కూడా సిద్ధరామయ్య రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు.అంతేకాదు లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు ఇవ్వకుండా జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని వెళ్లాలన్నది కాంగ్రెస్ వ్యూహం. అందుకే కుమారస్వామి ముందర కాళ్లకు బంధం వేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అనుసరించే విధానాలను బట్టే పొత్తు ఉంటుందని కుమారస్వామి చెప్పడం తాము కూడా సీట్ల విషయంలో రాజీపడేది లేదని చెప్పినట్లయింది. అంతేకాదు ప్రభుత్వ పాలనలో కూడా కాంగ్రెస్ నేతల జోక్యం ఉండకూడదని కుమారస్వామి భావిస్తున్నారు. తన తండ్రి దేవెగౌడతో చర్చించిన అనంతరం ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తమకు బలం ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ లోక్ సభ స్థానాలను జేడీఎస్ ఆశిస్తోంది.కేవలం లోక్ సభ ఎన్నికల్లో సీట్ల పంపకమే కాకుండా, రాష్ట్రంలో నెలకొన్న కొన్నిసమస్యలపై కూడా కుమారస్వామి స్పష్టతను కాంగ్రెస్ అధిష్టానం నుంచి కోరనున్నారు. ఆయన నేరుగా రాహుల్ తోనే ఈవిషయాలను మాట్లాడనున్నట్లు తెలిసింది. మంత్రి వర్గ విస్తరణ తో పాటుగా కార్పొరేషన్ ఛైర్మన్ల పదవుల పంపకాన్ని కూడా కుమారస్వామి సీరియస్ గా తీసుకున్నారు. మొత్తం 30 కార్పొరేషన్ల ఛైర్మన్లలో జేడీఎస్ కు పది మాత్రమే దక్కుతాయని సిద్ధరామయ్య చెప్పడాన్ని కూడాఆయన తప్పుపడుతున్నారు. స్థానిక పదవుల పంపకంలో తమకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో జేడీఎస్ మద్దతు తప్పదని భావిస్తున్న కాంగ్రెస్ ను ముందుగానే కుమారస్వామి సంకటంలో పడేయాలని నిర్ణయించుకున్నారు.

Related Posts