ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నానికి గుండెపోటు వచ్చింది. తెలుగు, తమిళం భాషల్లో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన మణిరత్నం వయసు 63 సంవత్సరాలు. వెంటనే, చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త విన్న ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. మణిరత్నం సతీమణి ప్రముఖ సినీనటి సుహాసిని.