టాలెంట్ ఉంటే ఇండస్ట్రీలో ఎవరి ప్రలోభాలకీ లొంగాల్సిన అవసరం లేదని ‘విశ్వరూపం 2’ హీరోయిన్ పూజా కుమార్ స్పష్టం చేసింది. ఆగస్టు 10న విడుదలకానున్న విశ్వరూపం 2 సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాతో పూజా మాట్లాడుతుండగా.. ‘కాస్టింగ్ కౌచ్’పై అడిగిన ప్రశ్నలకి ఆమె ఘాటుగా సమాధానమిచ్చారు. ఇండస్ట్రీలో ఈ వివాదం వెలుగులోకి రావడం వల్ల చాలా మందికి అవగాహన కలిగిందని వివరించిన ఈ ముద్దుగుమ్మ.. తనకెప్పుడూ చేదు అనుభవాలు ఎదురుకాలేదని వెల్లడించింది. బెడ్ షేర్ చేసుకుంటేనే హీరోయిన్స్‌గా ఛాన్స్‌లు వస్తాయనుకుంటే ఎలా..? టాలెంట్ ఉండి కష్టపడే నైజముంటే ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా ఇండస్ట్రీలో అవకాశాలను దక్కించుకోవచ్చు. నా వరకు.. అలాంటి చేదు అనుభవాలు ఇప్పటి వరకు ఎదురుకాలేదు. కాస్టింగ్ కౌచ్ బాధితులు ఇలా మీడియా ముందు రావడంతో.. మిగతా వారిలో అవగాహన పెరుగుతోంది’ అని పూజా కుమార్ వెల్లడించింది.