విజయవాడ కాలువ గట్టున ఉన్నటువంటి ఇళ్ళ నుండి వస్తున్న మురుగు కె ఈ బి కెనాల్ ద్వారా దిగువన ఉన్న 22 మండలాలలో ఉన్న నీటి చెరువులు కలుషితం అవుతున్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు సత్వరమే చర్యలు తీసుకొని అర్బన్ డెవలప్మెంట్ వారు ఇచ్చినటువంటి నిధులతో ముందుగా ఆటోనగర్లో ఉన్నటువంటి 10 MLD అలాగే జక్కంపూడి లో ఉన్నటువంటి 20 ఎం. ఎల్ డి STP లను ప్రారంభించాలి. దీనిద్వారా దిగువ గ్రామాలకు వస్తున్నటువంటి నీటిలో కలుషిత జలాలు చేరటం తగ్గుతుంది.
ఇంకొకవైపు బోర్లు వేసి విజయవాడలో ఉన్నటువంటి పచ్చదనానికి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు.
ఢిల్లీలో ఇలా శుద్ధి అయినటువంటి మురుగునీటిని సీవర్ ద్వారా ఉద్యానవనాలకు, గవర్నమెంట్ కాలనీలకు మొక్కలు పెంచడానికి వాడుతూ ఉంటారు. విజయవాడలో కూడా బోరు నీరు వాడే బదులు ఇలా శుద్ధి అయిన జలాన్ని ప్రస్తుతం వాడుతున్న ట్యాంకర్ల ద్వారా విజయవాడ నగరంలోని రోడ్డు పక్కన ఉన్నటువంటి మొక్కలకు ఉద్యానవనాలకు అందజేస్తే దిగువున ఉన్న మంచి నీటి కాలవలు కలుషితం కాకుండా ఉంటాయి. అదీకాకుండా ఎండాకాలంలో కూడా నీటిలభ్యత పెరుగుతుంది బోరు వాడకం తగ్గుతుంది.
పై విషయాన్ని కూడా ఒకసారి పరిశీలించి అధికారులు ఆచరిస్తే బాగుంటుంది.